Wednesday, January 5, 2011


వందలాది ఈ అక్షరాల్లో
అర్ధం కానివి ప్రే.. మ అనే రెండు అక్షరాలేగా..
పొతే పొనీ..అర్ధం కాకపొతే పొనీ

వేలాది బంధాల్లో
దక్కనిది ప్రేమ అనే ఒక్క బంధమేగా..
పొతే పొనీ..దక్కకపొతే పొనీ

లక్షలాది నా జన్మల్లో
వ్యర్ధమయ్యేది ప్రేమ దక్కని ఈ ఒక్క జన్మేగా..
పొతే పొనీ..వ్యర్ధం అయితే పొనీ

కొట్లాది నా గుండె చప్పుల్లలో
అగేది ప్రేమ కొల్పోయిన ఈ ఒక్క చప్పుడేగా
పొతే పొనీ..చప్పుడు ఆగితే పొనీ

చివరికి నా ఈ పంచ ప్రాణాలలో
పోయేది నువ్వైన నా ఈ ఒక్క ప్రాణమేగా
పొతే పొనీ..ప్రాణం పొతే పొనీ

చివరికి నేను
నా ఈ కన్నీటి సంద్రంలో ఏ బింధువులో అయినా
ఆనంద భాష్పాలు దొరుకుతాయేమో అని ఏరుకొంటూ..

ఈ అనంత వాయువులో ఎక్కడన్నా
నీ శ్వాస పరిమళాలు కాస్త కనపడతాయేమో అని అన్వేషిస్తూ..

ఈ జీవిత ఎడారి ఇసుకల్లో ఎక్కడన్నా
నీ పాద ముద్ర కనపడుతుందేమో అని వెతుక్కొంటూ..

ఈ పీడకలల మధ్యన ఎప్పుడైన
నువ్వు కనిపిస్తావేమో అని నిద్ర రాక నిద్ర పొతూ..

నీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొన్న ప్రతీసారి చిన్న సంతోషం లాంటి పెద్ద విచారం కలుగుతోంది ..

నీతో పంచుకున్న జ్ఞాపకాలను స్మరించిన ప్రతీసారి చావలేక బ్రతకాలి అనిపిస్తుంది

గుండెలో దాచుకొన్న నీ రూపం నా గుండెకే గాయాన్ని చేసినా..

కళ్ళల్లో దాచుకొన్న నీ అందం నాకు కంటి చెమ్మనే బదులిచ్చినా...

తెలియని నీ జాడ కోసం తపిస్తున్న నా మనసును చూస్తే

చిన్ని ఆశ లాంటి పెద్ద నిరాశ ఎదురోస్తుంది

ఆనంద బాష్పాల్లాంటి కన్నేటి శోకం మిగులుతుంది

Tuesday, January 4, 2011


మదిలో కట్టుకున్న ప్రేమనే చిట్టి గూడు,
మహావృక్షమై నా ఎదపై పాతుకుని, నను నిలువెల్లా ఆవహిస్తే
నా శరీరంలో ప్రతీ అవయువం, ప్రతీ నరం, ప్రతీ రక్తపుబొట్టూ..
ఆ మహావృక్షమే తన సర్వస్వం అనుకొని,
ఆ ప్రక్రుతిలో ప్రేమ పరిమళాన్ని ఆస్వాదిస్తూంటే!

ఎమయిందో ఏమో! కాలం చేసిన విలయతాండవం,
ఆ మహా వృక్షాన్ని కూకటివేళ్ళతోసహా
పెకలించి విసిరి అవతల పారేసిన
ఆ క్షణం!
గడచి గతమై అందరూ మరచిపోయినా..

ఇప్పటికీ నా శరీరంలో ప్రతీ అణువూ చెమరుస్తూ..
పారిన ఓ చిన్ని సెలయేరు.. ఓ జలపాతమై
మిగిలిన ఎదపై, పగిలిన గాయాలను తట్టిలేపుతుంటే....

గతం మరువలేక,
వర్తమానం గడుపలేక,
భవిష్యత్తును ఊహించలేక
ఈ బాధను భరించలేక..

మౌనంగా ఆక్రోశిస్తూ.. విలపిస్తున్నా...
మరణాన్నైనా దరిచేరమని దయతో, ఆర్ధిస్తూ!

Sunday, January 2, 2011


ఆదమరచి గాడంగా నిదురించేటపుడు...,
హటాతుగా ఏ అర్ధరాత్రో మేలకువను రప్పిస్తావు.
కలవరింతగానో, కలగానో నిదురలోనికి వచ్చి
మెలకువను రప్పిస్తావు.
మెలకువ అయితే నీవు లేవన్నది
జ్ఞప్తికి వచ్చి భాదై కమ్ముకుంటావూ...
ఎక్కడి నుండో మెత్తగా మందలింపులు...
వోదార్పుతో కూడినవి వినపడుతూ ఉంటాయి.
ఎవరా ఎక్కడినుండా అని వెతుకుతూ వుంటే
ఇంకెవరు నీవే...
నా మనసు మూలల నుండి భాధ ఎందుకని
కను బొమలు ఎగరేసి మరి అడుగుతూ ఉంటావు. నీ పద్దతిలో...
ఇంకేముంది పెదాల ఫై నవ్వై చేరుకుంటావు.
పంచధార లాంటి
స్నేహాన్ని, ఆత్మీయతని, ధైర్యాన్ని, సంతోషాన్ని, ఇష్టాన్ని ...
పంచదార లా పంచినందుకు
నీ ప్రతి జ్ఞాపకం పదిలమే ఇప్పటికీ ,
ముగ్దంగా మనోహరం గా మన ముందు కదిలిన వో కుసుమం,
గాలికి దూరమైనా గాని ,
అప్పుడీ విరిసిన తాజా పుష్పం లా నా మనసుని తడుముతూ నే
ఉంటావు ఎప్పటికి...
ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం లో మన అలసట తీర్చడానికి అన్నట్టు ..
ఎవరో ఒక పసి నేస్తం తన చేష్టలతో, అమాయకపు ప్రశ్నలతో
నన్ను తీయ తీయ గా విసిగించి,,
వెళ్ళేటప్పుడు ఏమి తెలియనట్లు చేయి ఊపి ..
పసిపాపలా నీవు వెళ్ళిపోయినా గాని ....
నాకు మాత్రం ఎప్పటికి ఆహ్లాదమై
జ్ఞాపకం లా నిలిచిపోతావు.

Friday, December 31, 2010


ఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,

నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!

ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!

ఏ మగువని చూసినా నీ రూపం గుర్తొచ్చేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!

ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!

ఒక్కమాటలో చెప్పలంటే-

"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".

అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".

ఎంటో జీవితం ఎప్పుడు ఎటుమలుపులు తిరుగుతుందో తెలియదు...ఆల్ హేఫీస్ అని త్రుప్తిగా నిదురించింది లేదు..ఓకప్పుడు ప్రతిక్షనం నీజ్ఞా పకాల దోంతరలో ఏంటో బయంకరమైన బయాలు దూరం అవుతున్నట్టు కలలు ఎవ్వరీ బలవంతంగా నానుంచి లాక్కెలుతున్నట్టు ..నీకు చెబితే నవ్వుతావని నీనుంచి ఉదయకాలపు పలుకరింపు వచ్చేదాక నిద్దుర రాదు..ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అంతా కళలా బయపడినంతా జరిగింది..కలలో వచ్చినదానికంటే జరిగిండే బరించలేనిది గా ఉంది నిజము కాదు అని ఎన్ని సార్లు అనుకున్ననో కాని జరిగింది తలుచుకుంటే ప్రతిక్షనం నరకంలా ఉంది..మరి జరిగిన ఘటనలు మర్చిపోటానికి ....మత్తు మనసుని గమ్మత్తు లోకాలకు తీసుకెలుతుంది..పొగ గుండేల్నీ చీలుస్తూంటే.. మందు గుండేళ్ళో భాదను కరిగిస్తుందని...ఆశ నిన్ను మర్చి పోటానికి ఆరెండే నాకిప్పుడు నేస్తాలు..అవి నాతీడుగా ఉన్నయంటే నామదిలో నీ తలపులు గాయం రేగుతోందని అర్దం కనీసం చిన్ని ఆశను సైతం పోగొట్టుకొని ..జివిస్తున్నానిలా..ఒక్కోసారి అనిపిస్తుంది కనీసం ఒక్కసారి అయిన గుర్తుకు వస్తనా అని కనీసం తిట్టుకోవడానికి అయిన అని ఎందుకు గుర్తుకు రావలి నేను..కదా నిజమే అవసరమే లేదు నీకు అందుకే రెండు నాకు దగ్గరయ్యాయి..ఎప్పటిదాకా తోడుంటాయో తెలీదు..నీకంత సిన్ లేదు అని నవ్వుకుంటున్నావుకదూ...ఎస్ అలగైనా నవ్వుతున్నవుకదా నాకదే చాలు

ఎందరో విష్ చేశారు..సెల్ కు ఎన్నీ మెస్సేలు వచ్చాయి వాటిలో నీవు ఓ చిన్న మెస్సేజ్ పంపిస్తావని ఎదురు చూశా మెస్సేజ్ వచ్చిన ప్రతిశారి అది నీవు పంపిన క్రిష్టమస్ శుభాకాంక్షల మెస్సేజ్ అని చూశా అవును నీకు పంపించాల్సిన అవసరం లేదు ...నీవు నాకు పంపటానికి నేను ఎవరిని కదా..?

Wednesday, December 22, 2010


నా మనస్సుని గెలిచి ఊహాలను ఓదార్చి ఒంటరి జీవితానికి బానిస చేసావు ...
నీ ప్రేమకు సాక్ష్యం ఈ నా గుండే చప్పుడు నీవు లేకుండా తను బ్రతకలనే అశ కోల్పోయింది ...
అలుపు లేని కన్నీటికి సాక్ష్య్ఝం నీ ప్రేమ ... నీ మౌనంతో నా మనస్సు మూగదయ్యింది ...
ఈ క్షణం కాకపోయిన నా చివరి క్షణంకైనా నువ్వు వస్తావని వేచి ఉంటాను చెలి ...
నీ జ్ఞాపకలే నా ఊహాలకు కావ్యమయ్యాయి .. నీ చిరునవ్వులే నా జీవితానికి బ్రాంతి అయిపోయాయి చెలి .....
బంగారం .... నీ చిరునవ్వులతో నా చితి మంటను కాల్చు ...


ప్రతి కన్నీటికి ఒక అర్థం ఉంటుంది .....
ఒకరు తన కన్నీరు విడుస్తున్నారు అంటే అది ఒక సమస్య అని చెప్పాలేను ....
లోకన్ని ప్రతి మనిషి శాసిస్తాడు . అలాగే ప్రతి మనిషిని కష్టాలు .. కన్నీళ్లు శాసిస్తాయి ...
ప్రతి ఒక్కరు ఆనందాన్ని వెతుకున్నే వాళ్లే ... కాని ఒక్కరైన కన్నీటిని తుడిచేవారు ..... !
కన్నులున్నా వాడే చూడగల్గుతాడు లోకాన్ని ... కనులు లేను వాడు ఊహించగల్గుతాడు ....
చూసింది నిజమో కాదో తెలియని పరిస్థితి చూసిన వాడిది ....
కాని ఊహించిన వాడి ఊహకు రూపం ఉంది ... అది నిజం కాకపోయిన బాధపడడు ... ఎందుకంటే వాడు చూడకుంటా ఊహించాడు ...
ప్రతి కన్నీటిని ఊహించలేము ... దానిని లోతుగా వెళ్లి చూస్తేనే తెలుస్తుంది .. అలా వెళ్లినపుడు నీకు కన్నీళ్లు రావచ్చు ...
పట్టించుకోకు .. కాని ఎదుటివారి కన్నీటికి అర్థం తెలుసుకో .... విత్తిన చోటే చెట్టు పలిస్తుందన్నట్లు ... కన్నీరు ఉన్న చోట ఆనందం ఉంటుందన్నది నా భావన .... నా బాధ , నా కన్నీరు ... నా కష్టాలు , నా వేదన నా ఆనందం కాదు ,,,
నీ కన్నీళ్లకు ఆనందం ... నీ కష్టాలకు సుఖం ... నీ వేదనకు శాంతి ..... నీవు ఆనందంగా ఉండాలి ...