Tuesday, January 4, 2011


మదిలో కట్టుకున్న ప్రేమనే చిట్టి గూడు,
మహావృక్షమై నా ఎదపై పాతుకుని, నను నిలువెల్లా ఆవహిస్తే
నా శరీరంలో ప్రతీ అవయువం, ప్రతీ నరం, ప్రతీ రక్తపుబొట్టూ..
ఆ మహావృక్షమే తన సర్వస్వం అనుకొని,
ఆ ప్రక్రుతిలో ప్రేమ పరిమళాన్ని ఆస్వాదిస్తూంటే!

ఎమయిందో ఏమో! కాలం చేసిన విలయతాండవం,
ఆ మహా వృక్షాన్ని కూకటివేళ్ళతోసహా
పెకలించి విసిరి అవతల పారేసిన
ఆ క్షణం!
గడచి గతమై అందరూ మరచిపోయినా..

ఇప్పటికీ నా శరీరంలో ప్రతీ అణువూ చెమరుస్తూ..
పారిన ఓ చిన్ని సెలయేరు.. ఓ జలపాతమై
మిగిలిన ఎదపై, పగిలిన గాయాలను తట్టిలేపుతుంటే....

గతం మరువలేక,
వర్తమానం గడుపలేక,
భవిష్యత్తును ఊహించలేక
ఈ బాధను భరించలేక..

మౌనంగా ఆక్రోశిస్తూ.. విలపిస్తున్నా...
మరణాన్నైనా దరిచేరమని దయతో, ఆర్ధిస్తూ!

0 comments:

Post a Comment