Sunday, January 2, 2011


ఆదమరచి గాడంగా నిదురించేటపుడు...,
హటాతుగా ఏ అర్ధరాత్రో మేలకువను రప్పిస్తావు.
కలవరింతగానో, కలగానో నిదురలోనికి వచ్చి
మెలకువను రప్పిస్తావు.
మెలకువ అయితే నీవు లేవన్నది
జ్ఞప్తికి వచ్చి భాదై కమ్ముకుంటావూ...
ఎక్కడి నుండో మెత్తగా మందలింపులు...
వోదార్పుతో కూడినవి వినపడుతూ ఉంటాయి.
ఎవరా ఎక్కడినుండా అని వెతుకుతూ వుంటే
ఇంకెవరు నీవే...
నా మనసు మూలల నుండి భాధ ఎందుకని
కను బొమలు ఎగరేసి మరి అడుగుతూ ఉంటావు. నీ పద్దతిలో...
ఇంకేముంది పెదాల ఫై నవ్వై చేరుకుంటావు.
పంచధార లాంటి
స్నేహాన్ని, ఆత్మీయతని, ధైర్యాన్ని, సంతోషాన్ని, ఇష్టాన్ని ...
పంచదార లా పంచినందుకు
నీ ప్రతి జ్ఞాపకం పదిలమే ఇప్పటికీ ,
ముగ్దంగా మనోహరం గా మన ముందు కదిలిన వో కుసుమం,
గాలికి దూరమైనా గాని ,
అప్పుడీ విరిసిన తాజా పుష్పం లా నా మనసుని తడుముతూ నే
ఉంటావు ఎప్పటికి...
ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం లో మన అలసట తీర్చడానికి అన్నట్టు ..
ఎవరో ఒక పసి నేస్తం తన చేష్టలతో, అమాయకపు ప్రశ్నలతో
నన్ను తీయ తీయ గా విసిగించి,,
వెళ్ళేటప్పుడు ఏమి తెలియనట్లు చేయి ఊపి ..
పసిపాపలా నీవు వెళ్ళిపోయినా గాని ....
నాకు మాత్రం ఎప్పటికి ఆహ్లాదమై
జ్ఞాపకం లా నిలిచిపోతావు.

0 comments:

Post a Comment