Wednesday, April 6, 2011


ఈ రోజు ఎందుకో కలవరం..నీవు ఎక్కడున్నావంటూ మనస్సు అడుగుతోంది
గాయాలు గా మారిన జ్ఞాపకాలు...ఈ రోజెందుకో కలవర పెడుతున్నాయి..
ప్రతి క్షనం గుర్తుకొస్తున్నావు..నీవెక్కడంటూ మనస్సు కూడా నీకోసం తడుముకొంటోంది
మనస్సుకు సమాదానం చెప్పలేక... నాకు నేను సమాదాన పర్చుకోలేక భాదపడుతున్నా
గుండేళ్ళో దాగిన గుప్పెడు నిజాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి ఎక్కడున్నావంటూ అడుగుతున్నాయి..
కన్నీళ్ళకు కరనమౌతున్న నీ జ్ఞాపకాలు..ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నాయి..ఎక్కడున్నావు ప్రియా..
ఎన్నాళ్ళినా ఏన్నేళ్ళీలా..నీకోసం ఎదురు చూపులు అప్పటిదాకా ఈ ప్రాణం ఉండదేమో ప్రియా..?
నీవు గుర్తొచ్చినప్పుడల్లా గట్టీగా పీలుస్తున్న స్వాస.. ఎప్పటిదాకా ఉంటుందో తెలీదు

ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ....?


ఎన్మి పండుగలొచ్చినా ..నీవులేని వసంతం నాకెందుకు..?
కళ్ళలో కాంతులతో చీరకట్టుకొని నీవస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు..
అంతటి అద్బుత సౌందర్యింనీది...అలాంటి నీవు లేకుండా పండుగనా..?
నీ చిరునవ్వుల చిరుజల్లులు నావద్ద లేవు...నామనస్సే నాదగ్గర లేదు..
ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ..
నీవు తిరిగి ఇచ్చినా ఏముంటుంది దానిలో నీవుతప్ప..
గుండెల్లో గుర్తులు నీవులేకుండా నన్ను ప్రశ్నిస్తున్నాయి నీవెవరని..
అలా అడిగిన పశ్నకు నావద్ద సమాదానం మౌనమే..
మౌనం అనేది ఓ భయంకరమైన శిక్ష కదా...?
గలగల మాట్లాడే ఇద్దరి మద్యి మౌనం..ఓ పెద్ద నరకం..
మౌనం..నిజంగా ఇద్దరి మనుషుల మద్యి శాపం..
అది భాదను మరింత పెంచుతుంది..వేదనను మిగులుస్తుంది..
కొన్ని కారనాలు కత్తుల్లా గుండెల్ని తాకడం వల్లే మౌనం అనివర్యిం అవుతుంది..
అందుకే మౌనం కన్నా మరణ శిక్షే నయం ఒక్కసారితో ప్రాణంపోతుంది..
మౌనం ప్రతిక్షనం జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ...మనస్సును భాద పెడుతుంది

నా కనులకు కలలు కనడం తెలుసు
నిన్ను మరువడం మాత్రం తెలియదు..

నీ తోడు నేను కానని తెలుసు
నీనుండి దూరమవడం మాత్రం తెలియదు..

నా పెదవులకు నిన్ను పిలవడం తెలుసు
పరుషంగా మాటలతో గాయపరచడం తెలియదు..

నీ నీడనైన నాకు నీవు తప్ప ..నాకు నేను కూడా తెలీదు
నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం వీడటం తెల్సు


ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే ఎంతబాగుండు..?
నాకు చీకటే బాగుంది..వెలుతురును భరించలేకున్నా..
గుండెళ్ళో భాద...రాత్రి చీకట్లలో కల్సిపోయిన నిజాలు..
ఇక ఇలాంటి రాత్రులు చూడని రోజుకోసం ఎదురుచూస్తున్నా..
నిజాలు నిప్పుకణికలౌతాయి ఎప్పటికైనా అని నమ్ముతా..
అలాంటి నిప్పుల్నే ఎమార్చి..చల్లని ఐసుగడ్డలు చేస్తున్నారు..
నిజానికి, నిజాయితీకి చోటులేదు..నటించేవాల్లదేరాజ్యిం..
నిజాల్ని అబద్దాలు గా మార్చి...గుండెల్లో మంటలు రేపుతున్నారు..
మనిషిగా ఎప్పుడో చచ్చి పోయాను...రగిలిపోయిన మనస్సు ఇప్పుడు బూడిదైంది
ఇప్పుడు ఆనిజం అసలు నిజం కావాలని ఉంది..
ఆనిజంకోసం కొందరు ఎదురు చూస్తున్నారు..
ఈ రాత్రిచీకట్లలా గుండెనిండా చీకటే కమ్ముకుంది..వెలుగులేనంతగా
గుండెలనిండా చీకటి ప్రపంచమంతా చీకటి నాకిక వెలుగులు వద్దు..
వెలుగు వెలుతురు రేఖలు నేను భరించలేను..తట్టుకోలేను..
వద్దనుకున్నా వాస్తవాన్ని తట్టుకోలేక పోతున్నా..బరించలేక పోతున్నా.
ఈ నిషారాత్రి చీకటీలో ఎప్పుడూ కల్సిపోతానా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నా..

నేను అడగ కుండానే నా జీవితంలోకి ప్రవేశించావు
అంధకారమైన నా జీవితంలో ఆశల హరివిల్లులు చూపించావు
మోడు వారిన నా జీవితంలో ప్రేమను చిగురింప చేశావు
ఊహల ఊయలలో విహరింప చేశావు
నా ఆశ నువ్వు, నా శ్వాస నువ్వు, నా సర్వస్వం నువ్వనుకున్నా.....
నా హృదయ మందిరంలో గుడి కట్టి పూజించుకున్నా.....

కానీ..... ఏమిటీ అలజడి..... ఎందుకింత దారుణం.......
ఈ క్షణం నా గుండె ఆగిపోతే బావుండునేమో కదా.....
ఈ భారం నే మోయలేను
..

గుండెళ్ళో అగ్నిగోళాలు పెట్టుకొని నటించడం కష్టం..
పరిస్థితులు అన్నీ ఎదురు తిరుగుతున్నాయి..అందుకే నిర్నయించుకున్నాను..
అందుకే ఆరోజుకోసం ఎదురుచూస్తున్నా...ఎవ్వరకి తెలియకుండా ఉండాలికదా..
అందుకే గుండెళ్ళో అంత భాదపెట్టుకొని నటిస్తున్నా..ఏమీ జరగనట్టు
కాని ఇప్పుడు అర్దం అవుతుంది నటించడం ఎంత కష్టమో..భరించడం కష్టం
వాస్తవాన్ని మరచి ప్రస్తుతాన్ని తరచి చూస్తే ఏమీ అర్దంకాని పరిస్థితి..
నిజం ఇంత ఖటినంగా ఉంటుందో అర్దం కావడం లేదు..అయినా ఎందుకులే..
జరగాల్సిన దానిగురించే ఆలోచిస్తున్నా...జరిగినతరువాత ఆవిషయం మనకు తెలీదుగా..
మంచిగా అలోచించడం ...అందరికి మంచి జరగాలనుకోవడం నేరమా..?

నిన్ను ప్రేమించినందుకు పిచ్చి వాడినయ్యాను.



నిన్ను ప్రేమించినందుకు...
నువ్ నన్ను మరిచిపొమ్మన్నందుకు...
గుండె పగిలేలా ఏడవాలని ఉంది.
కానీ...! నా కనులకు నాపై కరుణ లేదు.
కనీసం ఓ కన్నీటి చుక్కను రాల్చనంటున్నాయి.
దేవుడా...! నాకెందుకీ శిక్ష? అని గట్టిగా అరవాలని ఉంది.
కానీ...! నా పెదవులు నుంచి మాట పెగలడం లేదు.
విధి చేతిలో మోసపోయానని ఆ సమయం కూడా...
టిక్.. టిక్.. అంటూ నన్ను వెక్కిరిస్తోంది.
కనులుండి గుడ్డి వాడినయ్యాను...
నోరుండి మూగ వాడినయ్యాను...
బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది..ఆరోజు ఎప్పుడాని చూస్తున్నా
మనసులో ఎలాంటి ఉద్దేశ్యాలు లేనుకున్నా మంచి చెడు అవుతోంది.
నేనేమైనా ..నన్నేమన్నా అందరూ బాగుండాలన్న కోరిక కూడా తిరగ బడుతోంది.
ఎన్నో భరించాను..భరిస్తున్నాను ఎదురుతిరుగుతున్న ఘటనలు ఇంక తట్టు కోలేను..
ఎన్నని నిదుర లేని రాత్రుల్లు గడపను..చిన్ని గుండె అస్సలు తట్టుకోలేకపోతుంది ..
తెల్లారుతుంటే ఏఘటన ఎదురుతిరుగుతుందోని బయం నీడలా వెంటాడుతోంది
ఎవ్వరికి అపకారం చేయాలనుకోలేదు.ఎవ్వరిని కించపరచాలని అనుకోలేదు..
అందుకే నాకు నేను శిక్షవిదించుకోవాలనుకున్నా..ఈ భాదలు తట్టుకోలేక పోతున్నా

నీ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి
ప్రేమను ప్రేమించడానికి
ఆటుపోటులు వచ్చాయి ప్రేమలో
ఏం చేద్దాం...అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

ఎంత ఆలోచించినా నీ జ్ఞాపకాలను మరులేకున్నాను
అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

ప్రేమలో అన్ని కలలు తియ్యగానేవున్నాయి
కాని.. నీవు లేని లోటుతో
చేదుగా మారింది జీవితం
అయినా నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

క్షణమొక యుగంలా గడిచినా...
రోజులు, నెలలు, సంవత్సరాలు జెట్ స్పీడుతో పరుగెట్టినా...
మునుపటి ఉత్సాహం లేదు..
నిరాశ..నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాను
అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

నిద్ర కోడి నిద్రలా మారింది
ఆలోచనలు ముసురుకుంటున్నాయి
అయినా నీజ్ఞాపకాలు వెంటా...డుతూ...నే.....ఉన్నాయి