Wednesday, April 6, 2011
ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ....?
ఎన్మి పండుగలొచ్చినా ..నీవులేని వసంతం నాకెందుకు..?
కళ్ళలో కాంతులతో చీరకట్టుకొని నీవస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు..
అంతటి అద్బుత సౌందర్యింనీది...అలాంటి నీవు లేకుండా పండుగనా..?
నీ చిరునవ్వుల చిరుజల్లులు నావద్ద లేవు...నామనస్సే నాదగ్గర లేదు..
ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ..
నీవు తిరిగి ఇచ్చినా ఏముంటుంది దానిలో నీవుతప్ప..
గుండెల్లో గుర్తులు నీవులేకుండా నన్ను ప్రశ్నిస్తున్నాయి నీవెవరని..
అలా అడిగిన పశ్నకు నావద్ద సమాదానం మౌనమే..
మౌనం అనేది ఓ భయంకరమైన శిక్ష కదా...?
గలగల మాట్లాడే ఇద్దరి మద్యి మౌనం..ఓ పెద్ద నరకం..
మౌనం..నిజంగా ఇద్దరి మనుషుల మద్యి శాపం..
అది భాదను మరింత పెంచుతుంది..వేదనను మిగులుస్తుంది..
కొన్ని కారనాలు కత్తుల్లా గుండెల్ని తాకడం వల్లే మౌనం అనివర్యిం అవుతుంది..
అందుకే మౌనం కన్నా మరణ శిక్షే నయం ఒక్కసారితో ప్రాణంపోతుంది..
మౌనం ప్రతిక్షనం జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ...మనస్సును భాద పెడుతుంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment