Saturday, July 2, 2011

ఇదే నిజంకదా....?



Friday, July 1, 2011

నాతో పరిచయానికి ముందే ఇలా జరుతుందని నీకు తెల్సు..




నన్ను మోసం చేశావు కదూ..
దారుణంగా మోసంచేశావు..
ఎందుకిలా చేస్తున్నావు..?
నన్నేందుకిలా వేదిస్తున్నావు..?

నాతో పరిచయానికి ముందే ఇలా జరుతుందని నీకు తెల్సు..
అన్నీ జరిగిన తరువాత నను దోషిని చేసి తప్పుకున్నావు..
నీకిది న్యాయమా...నన్ను అర్దం చేసుకుంది ఇంతేనా..
సంతోషాన్ని నీవు చూసుకున్నావు మరి నేను..?

ప్రతి క్షనం ప్రతి నిమిషం నేనిలా భాదపడతానని తెల్సీ..
ఏమీ తెలియనట్టు అమాయకంగా ..హేపీగా ఉన్నావు..
నేనేమైపోతున్నా అని తెల్సినా నీవు మాట్లాడవు..
నీమనసులో ఏముందో ఇప్పుడు తెలుస్తోంది..
అది జరుగుతుందిలే..ఆరోజొస్తుందిలే..:(

నీతొ గడిపిని ఆ క్షణాలు చాలు జీవితంలో అన్నీ మర్చిపోవడానికి,

ఆ అమౄతాన్ని తాగినట్లుంది నీ అధరాలని చుంభించినప్పుడు,

అజంతా శిల్పానికి ప్రాణం పొశరా అన్నట్లుంది నీ దేహాన్ని తాకుతుంటే,

నా మొహావేశానికి నీ అందాలతొ ఆనకట్ట వేశవు కదా,

ఎంతొసేపు వెదికాను నీ సన్నని నడుముని కనిపించలేదు,

బహుశా నీ హ్రుదయ బరువుని మోయ్యలేక అది సన్నబడినట్లుంది,

అంగాంగాన్ని శౄంగారంలొ జత చేశావే,

నీ అందాలని ఒక్కొక్కటిగా చూస్తుంటే నిన్ను తయారు చేసినా ఆ భగవంతుడికి చేతెలెత్తి నమస్కరించాలి,

నీ సాంగత్యంలొ కలమంతా క్షణాలుగా మరిపొతున్నయి,

చిరునవ్వు నవ్వుతూ నా నుదుటిన పెట్టిన ఆ ముద్దు చాలు ఈ జీవితానికి,

ప్రేమతొ నన్ను కౌగిలించుకున్న క్షణాలు చాలు,

ఆఖరి క్షణాలలొ నువ్వు నాకిస్తానన్న బహుమతి ఇదేనా,

మరణాని కన్నా ముందే నాకు స్వర్గం చూపించావు,

అదేంటి నా శరీరం చల్లబడింది,

ఎందుకు నీ కళ్ళల్లొ కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి,

నా మాటలు నీకు వినిపించటం లేదేంటి,

ఎవరొ నన్ను తీసుకెళ్ళిపొతున్నారు నీ నుండి,

ఎలా చెప్పాలి వీళ్ళకు మన ప్రేమను విడతీయద్దని,

వెళ్ళిపొతున్నా ప్రియతమా ఈ లోకాన్ని,దానికన్నా ఎక్కువైనా నీ ప్రమని వదిలేసి.