Wednesday, April 6, 2011

నిన్ను ప్రేమించినందుకు పిచ్చి వాడినయ్యాను.



నిన్ను ప్రేమించినందుకు...
నువ్ నన్ను మరిచిపొమ్మన్నందుకు...
గుండె పగిలేలా ఏడవాలని ఉంది.
కానీ...! నా కనులకు నాపై కరుణ లేదు.
కనీసం ఓ కన్నీటి చుక్కను రాల్చనంటున్నాయి.
దేవుడా...! నాకెందుకీ శిక్ష? అని గట్టిగా అరవాలని ఉంది.
కానీ...! నా పెదవులు నుంచి మాట పెగలడం లేదు.
విధి చేతిలో మోసపోయానని ఆ సమయం కూడా...
టిక్.. టిక్.. అంటూ నన్ను వెక్కిరిస్తోంది.
కనులుండి గుడ్డి వాడినయ్యాను...
నోరుండి మూగ వాడినయ్యాను...
బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది..ఆరోజు ఎప్పుడాని చూస్తున్నా
మనసులో ఎలాంటి ఉద్దేశ్యాలు లేనుకున్నా మంచి చెడు అవుతోంది.
నేనేమైనా ..నన్నేమన్నా అందరూ బాగుండాలన్న కోరిక కూడా తిరగ బడుతోంది.
ఎన్నో భరించాను..భరిస్తున్నాను ఎదురుతిరుగుతున్న ఘటనలు ఇంక తట్టు కోలేను..
ఎన్నని నిదుర లేని రాత్రుల్లు గడపను..చిన్ని గుండె అస్సలు తట్టుకోలేకపోతుంది ..
తెల్లారుతుంటే ఏఘటన ఎదురుతిరుగుతుందోని బయం నీడలా వెంటాడుతోంది
ఎవ్వరికి అపకారం చేయాలనుకోలేదు.ఎవ్వరిని కించపరచాలని అనుకోలేదు..
అందుకే నాకు నేను శిక్షవిదించుకోవాలనుకున్నా..ఈ భాదలు తట్టుకోలేక పోతున్నా

0 comments:

Post a Comment