Wednesday, December 22, 2010



నీ కై తపనలో వెదుకులాటలో
ఎక్కడో నన్ను నేను పారేసుకున్నాను
జీవితాన్ని చే జార్చుకున్నాను
ఇప్పుడు అంత శూన్యం
ఒక్క నీ కోసం చాల పోగుట్టుకున్న
నాకు ఎందుకింత ఆశ....?
నీ కన్నుల వెలుగులతో నా జీవితాన్ని నింపుకోవాలని
నీ కోసం ఎదిరి చూస్తూ ఉంటాను ...
నువ్వు రావని తెలిసిన....
నిన్ను చూస్తూనే ఉంటాను ..
నువ్వు నా ఎదుట లేకున్నా ..
నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను ..
నీకు నేను గుర్తుకురాకున్న ...
నిన్ను నా మనసులో కొలువు0చుతాను..
నా హ్రూధయాన్ని నివు గాయపరిచినా ....
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను....
నీవు నన్ను విడిపోయిన ......
నీ అనుకునే నేను

వేకువజామున ఎమయ్యాయి నీ పలకరింపులు..
వేకువ జామున నీపలకరింపు కోసం ఎదురు చూస్తుంటే పలుకరించి...పడుకో బుజ్జీ అన్న నీపలుకు ఏవి..?
ఎంత గొడవపడిన చివరకు నివు చెప్పే సారీలు ఏవి..?
నేను మాట్లాడకపోతే మౌనవ్రతం చేస్తానన్ని నీ మాటలు ఏవి..?
నలుగురిలో నేను ప్రత్యేకం అన్న నీ మాటలు అబద్దాలేనా
తన అడుగుల సవ్వడిని నా నడకతో లయకలిపేది అంతా బూటకమేనా...
తను విడిచిన శ్వాసతో నాకు ఊపిరిపోసేది...
తన కొంటేతనంతో నన్ను కవ్వించేది... ఏంకావలి అని ప్రశ్నించేది...
కలలోకూడ నాతో కలసిబ్రతకాలి అన్న ప్రేయసి ... ఓ బందానికి తలొంచి ప్రేమను వదిలేసింది...
ఆ క్షణాన కలిగిన భావానికి ఎదిరించే ధైర్యం ఉన్నా... స్వాగతించే ఓపిక తనకిలేదు...
అర్ధం చేసుకునే వయసున్నా ...తెలుసుకునే మనసు తనకిలేదు...
ఎదేమైన తనవల్ల జీవితంలో ..ఓ మంచి స్నేహాన్ని కోల్ఫోయాను
ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది మంచి చేశాననుకొంటూ తప్పులు చేశానేమో అని
ఒక్కటి మాత్రం నిజం నీకు కీడు చేయాలని కలలో కూడా అనుకోలేదు
భయపడిందంతా జరిగింది కాని నేనాసించిన నీ సపోర్టు ఇసుమంతాలేకపోవటం
ఇప్పటికీ నాకర్దంకాని జవాబులేని ప్రశ్న గానే మిగిలిపోయింది?
ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నట్టే..నాతో కల్సి నడుస్తున్నట్టు.
నాపక్కనే ఉండి నవ్వుతున్నట్టు బ్రమలు ఇంకావీడిపోలేదు

ఓకప్పుడు మనం విడిపోతా మేమో అనుకున్నఫ్ఫుడు నీమీద నమ్మకం అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదని
అప్పట్లో నాకు నిద్రలేని రాత్రుల్లకు కారణంకూడా అదే...చివరికి అదే నిజం చేశావు..
కొన్ని పరిస్థితులు ఎందుకు అలా క్రియేట్ అవుతున్నాయో అర్దంకాకుండా ఉన్నాయి
గతించిన ఓ పేజీని వర్తమానం చెరిపేస్తున్న యదలో ఓమూల తనప్రేమ ప్రవాహంలా పొంగుతునే ఉంది


నీవిలా చేస్తావని కలలోకుడా అనుకోలేదు..
పరిచయం ఉన్నన్నాళ్ళు నేను నీతో ఎలాఉన్నాను..
ఏరోజైనా ఏక్షనానైనా ..నిన్ను ఇబ్బంది పెట్టానా
ఒక్కసారిగా ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించలేకపోయావా..?
కొన్ని పరిణామాలకు నేను ప్రత్యెక్షకారణం కాదు..నా అనుకున్నవాళ్ళు చేయించారు..
నివెందుకు కాపని చేశావో నీఉద్ద్యేశ్యం ఏమిటో తెలీయదు..
నీవు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది..ఆరని అగ్ని గోళంలా
నిజాయితీ గా స్నేహం చేసినందుకు మర్చిపోలేని గిష్ట్ ఇచ్చావు..
నీకు తెల్సి చేసావు తేలికచేశావో జీవితంలో మర్చిపోలేని గిప్ట్ ఇచ్చావు..
ఆరని అగ్నిరగిల్చి హాయిగా లైఫ్ ఎంజాయి చేస్తున్నావు
నిన్ను అనేంత ష్టేజి కాదు నాది ...అనుకునేంత స్వతంత్రంలేదు ఇప్పుడు మనమద్యి
మనిషిలోని మనస్సుకు మేధస్సుకు మద్యి వైరం రగిల్చావు..
ఒకప్పుడు కొంచెమే ఉండేది ...నివురుగప్పిన నిప్పులా దానికి అగ్నిని రాజేశావు..
రాజీ పడలేని ఘర్షన..రేపు ఏదైనా జరగొచ్చు అదేగా నీకు కావల్సింది
మనసు గాజుగుండెలో బందించి ఒక్కసారిగా బద్దలు చేసినట్టుంది..

Saturday, December 18, 2010


పవిత్రతకు
దారి తెల్పే పరమ రహస్యం నిశ్శబ్దం
నీ మాటల తూటాలు
నీవు మిగిల్చిన గాయాల తాలూక మచ్చలకు
నిశ్శబ్దం
లేపనంగా మారి మాయం చేస్తుంది
అనే ఆశతో నిశ్శబ్దంగా జరిగేది చూస్తున్నా..
మళ్ళీ తిరిగి వచ్చే వసంతం కోసం కాదు..
ఆ ఆశ ఎప్పుడో చచ్చిపోయింది..
జరిగిన నిజం తెల్సుకునే రోజుకోసం..అ సలు నిజం తెల్సినరోజు ..
కార్చే కన్నీటీ బొట్టులో అబద్దం కొట్టుక పోతుందని ఎదురు చూస్తున్నా నిశ్శబ్దంగా..
కానీ ఆనిజం ఎప్పటికీ తెల్సు కోలేవని..తెల్సుకునే ప్రయత్నం చేయవనేది గట్టినమ్మకం..అదీ గమనిస్తున్నా నిశ్శబ్దంగా

దూరం అవుతున్న జ్ఞాపకాలు..

మనసులోంచి జారిపోతున్నాయి..దూరం అవుతున్నాయి

ఆత్రంగా పట్టు కోబోతే మళ్ళీ జారిపోతున్నాయి..ఇంకా దూరం ఔతున్నాయి

జారి పోయిన జ్ఞపకాలను పట్టుకోలేని..తిరిరాలేవని తెల్సినా..

అప్పుడప్పుడు చేస్తున్న పిచ్చి ప్రయత్నాలతో ఉన్న కొన్ని జ్ఞాపకాలు జారిపోతున్నాయి

కాని ఇప్పుడు అర్దం అయింది గడచి పోయిన జ్ఞాపకాలు తిరిగిరావు

రాబోయిన ఆక్షనాల్ని పోగొట్టుకున్ననని అలస్యింగా తెల్సుకున్నాను

Tuesday, December 14, 2010


తన కోయిల స్వరం నా మాటలతో పోటిపడేది...

తన మువ్వల సవ్వడిని నా నడకతో లయకలిపేది...

తను విడిచిన శ్వాసతో నాకు ఊపిరిపోసేది...

తన కొంటేతనంతో నన్ను కవ్వించేది... ఏంకావలి అని ప్రశ్నించేది...

కలలోకూడ నాతో కలసిబ్రతకాలి అన్న ప్రేయసి ఓరోజు పెగుబందానికి తలొంచి ప్రేమను వదిలేసింది...

ఆ క్షణాన కలిగిన భావానికి ఎదిరించే ధైర్యం ఉన్నా... స్వాగతించే ఓపిక తనకిలేదు...

మాటదాటని కూతురుగా పదిమందికి ఆదర్శం కావలనుకుందో లేక ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుందో...

అర్ధం చేసుకునే వయసున్నా తెలుసుకునే మనసు తనకిలేదు...

ఎదేమైన తనవల్ల జీవితంలో సర్వస్వం కోల్పోయాను...

గతించిన ఓ పేజీని వర్తమానం చెరిపేస్తున్న యదలో ఓమూల తనప్రేమ ప్రవాహంలా పొంగుతునేఉంది...

ప్రేమగురుతులు ఉన్నంతకాలం వేరొకరిని వరించలేను... తనతో వ్యెబిచారం చేయలేను...

నా మనసు మధించి నీకు ప్రేమామృతం అందిస్తున్నా ఆశ్వాదించలేవు,

నీ చెలిమి నా మనసుకు సంతృప్తి నివ్వడం లేదన్నా అనురాగాన్ని అందించలేవు,

నీ ఏకాంతంలో నా ఆలోచనలకి స్థానం కావాలి అన్న అర్దంచేసుకోలేవు,

నీ మాటలలో మాధుర్యం మనసు పంచేదై ఉండాలన్నా ఆలకించలేవు,

నీ పెదవిపై నవ్వుగా, నీ కనులలో కన్నీరుగా నేను ఉండాలన్నా అంగీకరించలేవు,

ప్రతి క్షణం నీకై, నీడై, నీవై నీతో వుంటాను అన్నా ఆలోచించలేవు,

నీ చేరువలోనే ఈ దూరాన్ని భరించలేనన్నా పట్టించుకోవు,

చివరికి నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నీవేనని తెలుసుకోలేవు.

నీ తలపుకన్న ప్రతిక్షణం,...గతమంతా కన్నీరై పారుతుంది,
నిను చూడలేనన్న ప్రతిచూపు ,...చీకటిలో కలిసిపోతుంది,
మరలి రావన్న ప్రతి వూహ ,... ఆయుష్షు కరిగిస్తోంది,
నిను చేరలేన్న ప్రతి శ్వాస,... హృదయాన్ని ఆగిపోమ్మంటుంది...

ముసుగుకప్పిన నీ మాటాల తెరచాటున,
బయటపడలేక బంధించబడ్డ భావం ప్రేమ కాదా?

తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?

ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?

గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?

తలిదండ్రులు మన ప్రేమకు కంచెలు వేస్తుంటే...

అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......

జీవితాంతం ప్రేమలేని ప్రాణులుగా బ్రతికేద్దాం......

Monday, December 6, 2010


ఇన్నాళ్లూ... ఇన్నేళ్లూ...
నాతో ఉన్న నీవు ఇప్పుడు లేవనే ఊహ
ఈ ఊహ కన్నా ఊపిరాగిపోయినా బాగుండు
జన సమ్మర్ధ ఎడారిలో ఒంటరినై సాగుతున్నా
ఎడతెగని ఆలోచనలతో అలసి ఆగిపోతానా
ఒక్కసారి వెనక్కు చూడాలనిపిస్తుంది
దొంతర దొంతరలుగా జ్ణాపకాలు ..
ఒకదానితో ఒకతి పోటీ పదుతూ...
నా తరువాతే నువ్వంటూ..
ఒక దానిలో ఒకటి మిళితమవుతూ...
ఒక దానితో ఒకటి పెనవేసుకుంటూ..
అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నీ ఊసులతో
కాని కుదరదే..
మళ్లీ పయనం మొదలెడతా..

I collected from this blog

http://sreevasini.blogspot.com/2010/07/blog-post_6612.html