Tuesday, December 14, 2010


నా మనసు మధించి నీకు ప్రేమామృతం అందిస్తున్నా ఆశ్వాదించలేవు,

నీ చెలిమి నా మనసుకు సంతృప్తి నివ్వడం లేదన్నా అనురాగాన్ని అందించలేవు,

నీ ఏకాంతంలో నా ఆలోచనలకి స్థానం కావాలి అన్న అర్దంచేసుకోలేవు,

నీ మాటలలో మాధుర్యం మనసు పంచేదై ఉండాలన్నా ఆలకించలేవు,

నీ పెదవిపై నవ్వుగా, నీ కనులలో కన్నీరుగా నేను ఉండాలన్నా అంగీకరించలేవు,

ప్రతి క్షణం నీకై, నీడై, నీవై నీతో వుంటాను అన్నా ఆలోచించలేవు,

నీ చేరువలోనే ఈ దూరాన్ని భరించలేనన్నా పట్టించుకోవు,

చివరికి నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నీవేనని తెలుసుకోలేవు.

0 comments:

Post a Comment