Wednesday, December 22, 2010
వేకువజామున ఎమయ్యాయి నీ పలకరింపులు..
వేకువ జామున నీపలకరింపు కోసం ఎదురు చూస్తుంటే పలుకరించి...పడుకో బుజ్జీ అన్న నీపలుకు ఏవి..?
ఎంత గొడవపడిన చివరకు నివు చెప్పే సారీలు ఏవి..?
నేను మాట్లాడకపోతే మౌనవ్రతం చేస్తానన్ని నీ మాటలు ఏవి..?
నలుగురిలో నేను ప్రత్యేకం అన్న నీ మాటలు అబద్దాలేనా
తన అడుగుల సవ్వడిని నా నడకతో లయకలిపేది అంతా బూటకమేనా...
తను విడిచిన శ్వాసతో నాకు ఊపిరిపోసేది...
తన కొంటేతనంతో నన్ను కవ్వించేది... ఏంకావలి అని ప్రశ్నించేది...
కలలోకూడ నాతో కలసిబ్రతకాలి అన్న ప్రేయసి ... ఓ బందానికి తలొంచి ప్రేమను వదిలేసింది...
ఆ క్షణాన కలిగిన భావానికి ఎదిరించే ధైర్యం ఉన్నా... స్వాగతించే ఓపిక తనకిలేదు...
అర్ధం చేసుకునే వయసున్నా ...తెలుసుకునే మనసు తనకిలేదు...
ఎదేమైన తనవల్ల జీవితంలో ..ఓ మంచి స్నేహాన్ని కోల్ఫోయాను
ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది మంచి చేశాననుకొంటూ తప్పులు చేశానేమో అని
ఒక్కటి మాత్రం నిజం నీకు కీడు చేయాలని కలలో కూడా అనుకోలేదు
భయపడిందంతా జరిగింది కాని నేనాసించిన నీ సపోర్టు ఇసుమంతాలేకపోవటం
ఇప్పటికీ నాకర్దంకాని జవాబులేని ప్రశ్న గానే మిగిలిపోయింది?
ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నట్టే..నాతో కల్సి నడుస్తున్నట్టు.
నాపక్కనే ఉండి నవ్వుతున్నట్టు బ్రమలు ఇంకావీడిపోలేదు
ఓకప్పుడు మనం విడిపోతా మేమో అనుకున్నఫ్ఫుడు నీమీద నమ్మకం అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదని
అప్పట్లో నాకు నిద్రలేని రాత్రుల్లకు కారణంకూడా అదే...చివరికి అదే నిజం చేశావు..
కొన్ని పరిస్థితులు ఎందుకు అలా క్రియేట్ అవుతున్నాయో అర్దంకాకుండా ఉన్నాయి
గతించిన ఓ పేజీని వర్తమానం చెరిపేస్తున్న యదలో ఓమూల తనప్రేమ ప్రవాహంలా పొంగుతునే ఉంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment