Monday, December 6, 2010


ఇన్నాళ్లూ... ఇన్నేళ్లూ...
నాతో ఉన్న నీవు ఇప్పుడు లేవనే ఊహ
ఈ ఊహ కన్నా ఊపిరాగిపోయినా బాగుండు
జన సమ్మర్ధ ఎడారిలో ఒంటరినై సాగుతున్నా
ఎడతెగని ఆలోచనలతో అలసి ఆగిపోతానా
ఒక్కసారి వెనక్కు చూడాలనిపిస్తుంది
దొంతర దొంతరలుగా జ్ణాపకాలు ..
ఒకదానితో ఒకతి పోటీ పదుతూ...
నా తరువాతే నువ్వంటూ..
ఒక దానిలో ఒకటి మిళితమవుతూ...
ఒక దానితో ఒకటి పెనవేసుకుంటూ..
అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నీ ఊసులతో
కాని కుదరదే..
మళ్లీ పయనం మొదలెడతా..

I collected from this blog

http://sreevasini.blogspot.com/2010/07/blog-post_6612.html

Tuesday, November 30, 2010


నువ్వు నాతో లేని క్షణం""నా నుంచి సంతోషం వేరవుతుంది నువ్వు దూరమైనంత తేలికగా..." ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు ఒకేసారి బావుర్మన్నాయి ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు అవ్యక్తమయ్యాయి.... "ఇక ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి మనో మైదానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది" ఏమీ తోచని నేను ఆత్మహత్యను అన్వేషిస్తూ బ్రతుకు దారుల్లో పరిభ్రమిస్తూ, భ్రమిస్తూ కన్నీళ్ళ ప్రక్కదారుల్లోకి జారిపోతున్నా...! ప్రేమ సాగరానికి దూరంగా, అభిముఖంగా ప్రవహిస్తున్నా! ఏదో తెలీని అడ్డుగోడ ఎదురై ఉనికిని ప్రశ్నిస్తే వెనుతిరిగా.......... అప్పుడే తెలిసింది "నువ్వు నాతొలేవు..." .........................నీ

నేను ప్రేమిస్తున్నాను అనే గొప్ప
విచారకరమైన భావనపై నేనెపుడూ ఖేదపడతాను.
నాకు తెలుసు అది వ్యాథిలాగ నన్ను తినేస్తుందని
యీ ప్రేమ
యిదెపుడూ నన్ను జయిస్తుంది
నా విచారపు ముసుగులో నాకు తెలీని రహస్యాలెన్నో?

నువ్వు నా దగ్గిరున్నపుడు
నన్ను దిగులు చుట్టుముడుతుంది
నువ్వు వెళ్లిపోయినపుడు యీ
వస్తు సముదాయం అంతా అర్థం లేనిది.
యీ నా ప్రేమనీ-విషాదాన్నీ
అంతటినీ గుమ్మరించేస్తాను.
అప్పుడిక నేను తపించడానికి యేమీ వుండదు.

- నీ తేలికైన అడుగుల చప్పుడు విన్నపుడో లేక
- నీ పావడ అంచు తగిలినపుడో లేక
- నీ తొలి యవ్వనపు ఆర్భాటాన్ని నింపుకున్న కంఠం
మెత్తగా నన్ను స్పృశించినపుడో
నన్ను నేను అవాస్తవికంగా చిత్రీకరించుకుంటాను
-యే ఉదయపు వాకిటో
నువ్వు దక్షిణ మారుతం కోసం వెళ్లినపుడో
-యే సాయంత్రమో 'అతని 'తో
పియానో వాయిస్తో గడిపినపుడో
- లేక 'అతను' వెళ్లిపోయిన దినాన్నంతా
విచారగ్రస్తం చేసినపుడో నిన్ను మాట్లాడించటానికి భయపడతాను!

నేస్తం! మరక పడిన నా నెత్తుటితో
నీకోసం చేయి చాచలేను.

నీ జ్వలిత హృదయాన్ని నా ప్రేమ తాకలేదు.
ప్రియా! నువ్వు నటించగలిగితే
నన్ను ప్రేమించగలవు!

నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.

నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.

జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.

నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది?!

Sunday, November 21, 2010


ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.

ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.

ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.

ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.

ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.

ఆమె ఎదురుపడింది. గుండె వేగాన్ని పెంచేస్తూ, కొత్త ప్రపంచానికి స్వాగతిస్తూ.

ఆమె పరిచయమయింది. గతాన్నంతా చెరిపేస్తూ, నాలో ప్రేమను గుర్తుచేస్తూ.

ఆమె కలిసిపోయింది.
ఊపిరై మనసులొకి చేరుతూ,
ఊహలై మదిలో తిరుగుతూ.

ఆమె కోపగించుకుంది. నా ప్రేమను తిరస్కరిస్తూ, నా మనసుకి గాయంచేస్తూ.

ఆమె వెళ్ళిపోతుంది. నా ఆనందాలను మూటగట్టేస్తూ, నా కన్నుల నిండా నీరు నింపేస్తూ.

ఓ హృదయ మేఘమా, నా మనసు చూడుమా.

నీ ప్రేమ రాల్చుమా, నా ఎదను తడుపుమా.

దాహం తీరక,ఆశలు ఆవిరైపోతున్నాయి.

చూపులు తగలక, కన్నులు చీకటైపోతున్నాయి.

నా గుండెలో తడి నింపుమా, నీ చూపుల వెలుగు పంచుమా.

ఒంటరి కిరణాలలో మాడిపోతున్నా, చల్లగా నీ మాటలు కురిపించుమా.

తొలకరి ప్రేమకై ఎదురుచూస్తున్నా, నా ప్రేమకు జీవం పోయుమా.

ఎదతడికై ఎదురుచూస్తున్నా, కంటతడినే కానుకగా ఇవ్వకుమా.

బాధపడినంతనే బంధం నిలువదురా!

వదులుకున్న దానికై వేదన వలదురా!

భామపైన కోపం బ్రతుకుమీద ఏలరా?

ప్రేమ పంచలేని ప్రతిమ మనకేలరా!

కన్నీటిని కాంచలేని రూపు కనుపాపలో ఏలరా?

మనసున్న మగువ మనద్దయ్యే రోజు ముందుందిరా!!

Saturday, November 20, 2010



నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.

కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.

రాయబారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.

విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,

ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా

పుడమిని తడిపే స్వాతిచినుకు ఆనందమే,
చెలియ చూపుతో గుండెవణుకు ఆనందమే.

చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.

తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.

కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.

సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.