Tuesday, November 30, 2010


నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.

నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.

జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.

నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది?!

0 comments:

Post a Comment