Tuesday, November 30, 2010


నేను ప్రేమిస్తున్నాను అనే గొప్ప
విచారకరమైన భావనపై నేనెపుడూ ఖేదపడతాను.
నాకు తెలుసు అది వ్యాథిలాగ నన్ను తినేస్తుందని
యీ ప్రేమ
యిదెపుడూ నన్ను జయిస్తుంది
నా విచారపు ముసుగులో నాకు తెలీని రహస్యాలెన్నో?

నువ్వు నా దగ్గిరున్నపుడు
నన్ను దిగులు చుట్టుముడుతుంది
నువ్వు వెళ్లిపోయినపుడు యీ
వస్తు సముదాయం అంతా అర్థం లేనిది.
యీ నా ప్రేమనీ-విషాదాన్నీ
అంతటినీ గుమ్మరించేస్తాను.
అప్పుడిక నేను తపించడానికి యేమీ వుండదు.

- నీ తేలికైన అడుగుల చప్పుడు విన్నపుడో లేక
- నీ పావడ అంచు తగిలినపుడో లేక
- నీ తొలి యవ్వనపు ఆర్భాటాన్ని నింపుకున్న కంఠం
మెత్తగా నన్ను స్పృశించినపుడో
నన్ను నేను అవాస్తవికంగా చిత్రీకరించుకుంటాను
-యే ఉదయపు వాకిటో
నువ్వు దక్షిణ మారుతం కోసం వెళ్లినపుడో
-యే సాయంత్రమో 'అతని 'తో
పియానో వాయిస్తో గడిపినపుడో
- లేక 'అతను' వెళ్లిపోయిన దినాన్నంతా
విచారగ్రస్తం చేసినపుడో నిన్ను మాట్లాడించటానికి భయపడతాను!

నేస్తం! మరక పడిన నా నెత్తుటితో
నీకోసం చేయి చాచలేను.

నీ జ్వలిత హృదయాన్ని నా ప్రేమ తాకలేదు.
ప్రియా! నువ్వు నటించగలిగితే
నన్ను ప్రేమించగలవు!

0 comments:

Post a Comment