Wednesday, September 26, 2012

నా బ్లాగ్ మూగబోతుంది

 అమ్మాయిలకు ప్రేమించేటపుడు తల్లితండ్రులు గుర్తుకురారు
పెళ్ళి చేసుకునేటపుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు!

ఒక అమ్మాయి చేతిలో జీవితాన్ని కోల్పోయి ... జీవితాంతం ఒంటరిగా మిగిలి ... తోడు లేకుండ అమ్మాయినే తలుచుకుంటూ ... జీవితాన్ని గడిపే
మగవాళ్ళు ఎంతమందో..
వీళ్ళు జీవితం లో మరో అమ్మాయిని touch చేయలేరు తెలుసా....

ఒక అబ్బాయి చేతిలో శరీరాన్ని కోల్పోయి.... తలోచ్చుకొని ఏడ్చి... తోడు దొరకగానే ...
తోడే ... నా దేవుడనే జీవితాన్ని గడిపే
ఆడవాళ్లు .... ఎంతమందో.....


"మీ ఆడవాళ్ళ ఏడుపుకు ఓదార్పు దొరుకుతుంది
BUT
మగవాడి వేదనకు ఓదార్పు దొరకదు."

మీరు కలలు కంటారు కలలోనే జీవిస్తారు..
మీకు ప్రేమ పరిచయం కలలా... మిగిలిపోతుంది.
మగవాడికి... జీవితం ..అదే జీవితం .

చివరిగా. మాట.

ప్రేమనీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన మగవాళ్లు ఉన్నారు గాని... ఆడవాళ్లు లేరు కదా.

Bye to all my dear friends

Monday, October 3, 2011


ప్లీజ్ నాసంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వు..నేనేం తప్పు చేశాను..
ఎందుకిలా చేశావని అడుగను చేస్తున్నావు అని అడుగలేను..
ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడటమే నేను చేసిన తప్పు..
ఎందుకో నీవేం చేస్తున్నా ఎన్ని మాటలంటున్నా ఏం అనలేక పోయాను..
ఎందుకంటే ప్రాణంకటే ఎక్కువ ఇష్టపడ్డా కాబట్టి..నాకిలా జరగాల్సిందే కదా..
నా సంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా..ప్లీజ్
ఓడిపోయిన మనిషిని సారి నీవు దగ్గరుండి ఓడించిన మనిషిని ఎప్పుడన్నా గుర్తుకొస్తానా.?

Wednesday, July 20, 2011

జ్ఞాపకాలు చేదయ్యాక తానో తీపి గురుతుగా మిగిలిపోతూ ...




నా దానివే కావాలనుకున్న నా కోరికను ఆదిలోనే తుంచేయాలనుకున్నావు...

నాపై నీకు ప్రేమలేకుంటే ఇదంతా ఎందుకు చేశావు...
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమను నాకెందుకు పరిచయం చేశావు...

చెప్పు ప్రియా... ప్రశ్నిస్తేనే జీవితమన్నావు... నా జీవితం కోసం నేడు నిన్ను ప్రశ్నిస్తున్నాను... నా ప్రశ్నకు బదులివ్వగలవా... ?

Saturday, July 2, 2011

ఇదే నిజంకదా....?



Friday, July 1, 2011

నాతో పరిచయానికి ముందే ఇలా జరుతుందని నీకు తెల్సు..




నన్ను మోసం చేశావు కదూ..
దారుణంగా మోసంచేశావు..
ఎందుకిలా చేస్తున్నావు..?
నన్నేందుకిలా వేదిస్తున్నావు..?

నాతో పరిచయానికి ముందే ఇలా జరుతుందని నీకు తెల్సు..
అన్నీ జరిగిన తరువాత నను దోషిని చేసి తప్పుకున్నావు..
నీకిది న్యాయమా...నన్ను అర్దం చేసుకుంది ఇంతేనా..
సంతోషాన్ని నీవు చూసుకున్నావు మరి నేను..?

ప్రతి క్షనం ప్రతి నిమిషం నేనిలా భాదపడతానని తెల్సీ..
ఏమీ తెలియనట్టు అమాయకంగా ..హేపీగా ఉన్నావు..
నేనేమైపోతున్నా అని తెల్సినా నీవు మాట్లాడవు..
నీమనసులో ఏముందో ఇప్పుడు తెలుస్తోంది..
అది జరుగుతుందిలే..ఆరోజొస్తుందిలే..:(

నీతొ గడిపిని ఆ క్షణాలు చాలు జీవితంలో అన్నీ మర్చిపోవడానికి,

ఆ అమౄతాన్ని తాగినట్లుంది నీ అధరాలని చుంభించినప్పుడు,

అజంతా శిల్పానికి ప్రాణం పొశరా అన్నట్లుంది నీ దేహాన్ని తాకుతుంటే,

నా మొహావేశానికి నీ అందాలతొ ఆనకట్ట వేశవు కదా,

ఎంతొసేపు వెదికాను నీ సన్నని నడుముని కనిపించలేదు,

బహుశా నీ హ్రుదయ బరువుని మోయ్యలేక అది సన్నబడినట్లుంది,

అంగాంగాన్ని శౄంగారంలొ జత చేశావే,

నీ అందాలని ఒక్కొక్కటిగా చూస్తుంటే నిన్ను తయారు చేసినా ఆ భగవంతుడికి చేతెలెత్తి నమస్కరించాలి,

నీ సాంగత్యంలొ కలమంతా క్షణాలుగా మరిపొతున్నయి,

చిరునవ్వు నవ్వుతూ నా నుదుటిన పెట్టిన ఆ ముద్దు చాలు ఈ జీవితానికి,

ప్రేమతొ నన్ను కౌగిలించుకున్న క్షణాలు చాలు,

ఆఖరి క్షణాలలొ నువ్వు నాకిస్తానన్న బహుమతి ఇదేనా,

మరణాని కన్నా ముందే నాకు స్వర్గం చూపించావు,

అదేంటి నా శరీరం చల్లబడింది,

ఎందుకు నీ కళ్ళల్లొ కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి,

నా మాటలు నీకు వినిపించటం లేదేంటి,

ఎవరొ నన్ను తీసుకెళ్ళిపొతున్నారు నీ నుండి,

ఎలా చెప్పాలి వీళ్ళకు మన ప్రేమను విడతీయద్దని,

వెళ్ళిపొతున్నా ప్రియతమా ఈ లోకాన్ని,దానికన్నా ఎక్కువైనా నీ ప్రమని వదిలేసి.

Tuesday, May 3, 2011

ప్లీజ్ ఈ పని చేసేయ్....ఇక నావల్ల కాదు..


ప్లీజ్ ఈ పని చేసేయ్....ఇక నావల్ల కాదు..

Monday, April 18, 2011


ప్లీజ్ ఒక్క నిమిషం అయినా నన్ను గెలిపించవా...?
అవును నీవు నన్ను ఎప్పుడూ ఓడిస్తున్నావు..
ఎదిటి వాన్ని గెలిపించాలంటే నీవు నన్ను ఓడించాలి..
అతను గెలవాలనుకుంటుంన్నావు కాబట్టీ నన్ను ఓడిస్తున్నావు..
అప్పట్లో తట్టుకోలేకపోయినా అదేనిజం కాబట్టి తప్పదు..
పర్లేదు ఓటమి .... నాకు ఇచ్చింది నీవు కాబట్టీ ...?
నీకోసం ఎన్ని సార్లయినా ఓటమిని భరిస్తాను భారంగా..?
కాని ఎందుకో ఒక్కనిమిషం అన్నా గెలిపించవా అని అడగాలని ఉంది..
ఒకే ఒక్క నిమిషం చాలు ..ఎందుకంటే అంతకంటే నాకు అర్హత లేదుకదా..
నీకు ఇష్ట లేదు కదూ అందుకే ఓ ఆలోచన చేశా..!
ఎటు ఇది ఏప్రెల్ నెలకాబట్టి..ఒక్క నిమిషం గెలిపించి..?
ఏప్రెల్ ఫూల్ అని అనొచ్చు నీవు..ప్లీజ్ ఒక్కనిమిషం గెలిపించు చాలు..?
నా ఐడియా బాగుందికదా...ప్లీజ్ ఒక్కనిమిషం అన్నా గెలిపించవా ...!

Sunday, April 17, 2011

నా హ్రుదయానికి తగిలిన గాయం మానేలా లేదు..


నా హ్రుదయానికి తగిలిన గాయం మానేలా లేదు..
ఎందుకో
తెలీదు నీవంటే నాకంత ఇష్టం.. ఎందుకో నీవు నాకు అలా దూరం అయ్యావు..
దగ్గరగా
ఉన్నప్పుడే భయపడే వాడిని ఇంతగా ఇష్టపడుతున్నా దూరం అయితే...?
ఆలోచనే అప్పుడు అంత భయకరమనిపించిది అప్పుడు.. కాని అదేనిజం అయింది.
.
నీవు నన్ను అసహ్యించుకునేంతగా.. మరి నాహ్రుదయం ఎంత గాయపడుతుంది చెప్పు..
అదీ నీవు అసహ్యించుకునేంతగా అంటే నేను ఎలా తట్టుకోగలను చెప్పు..
ఇప్పటికీ
నీవంటే ప్రాణం అని మాత్రం చెప్పగలను.. నీకోసం ప్రాణం అయినా ఇవ్వగలను
కాని ఇప్పుడు నేనంటే నీకు అసహ్యంకదా...? వద్దు నీవులేని నాజీవితం వద్దు...బ్రతకాలని అస్సలు లేదు..
అదీ నీవు నన్ను అసహ్యించుకుంటున్నావు అని తెల్సి ఎలా బ్రతకను చెప్పు..
నీవు
అసహ్యించుకునే జీవితాన్ని నేను ఎలా జీవిస్తాను చెప్పు ప్రియా..

వర్తమానాన్ని తన జ్ఞాపకాల పుటల్లోకి ఆహ్వానించేది గతం.
ఆ తాలూకు అనుభవాలతో భవిష్యత్ని అనుకూలంగా
మార్చుకొవలనుకొనె అమాయకపు వర్తమానం.
వర్తమనపు అంచనాలకై నిరీక్షించింది భవిష్యత్.
భవిష్యత్ నుండి వచిన నేటి వర్తమానంతో పోల్చుకుంటే
నాకు గతం మిగిల్చిన ఆనందం ఎక్కువ.
జరుతుగున్న పరిణామాలు నాకు అర్దంకాకుండా ఉంది .
గతమే శాశ్వతం ఐతే మొన్నటి భవిష్యత్ అంటే నేటి వర్తమనాన్ని..
నమ్మాలో వద్దా ఏంజరుగ బోతోందో తెలియడంలేదు
మొత్తానికి ప్రస్తుతం కాలం మాత్రం నన్ను నేరస్తున్ని చేసింది
నువ్వెవరని వర్తమానం నన్ను వేక్కరించ్చింది వర్తమానం ఎందుకో.
అప్పుడు గుర్తుకొచ్చింది గతం నీలో వెతికినా సహజత్వం..
నీతో పంచుకోవాల్సిన మాటలు మనసులోనే సమాది ఐపోయాయి
కానీ నీ నీడని నాకివ్వకుండా మరెవ్వరికో తోడు అయ్యావు
కానీ నేనంటున్నాను నేనెవరంటే నీ స్వచ్చమైన నేస్తాన్ని
ఈ భావం నీ దరి చేరితే వచ్చే జన్మకు అయిన నీ తోడు అవ్వాలని
ఈ జన్మకు నీకేమౌతానో ప్రియా నీవే సమాదానంచెప్పాలి...

Thursday, April 14, 2011


నిశీధి రాత్రిలో తొలి కిరణం నీవు...
ఆశల సౌధానికి పునాది నీవు...
ఎడారి పయనంలో నీటి చెలమ నీవు...

నేనంటూ ఉన్నానని చెప్పింది నీవు...
నాలోని ప్రతి అంశకు సంకేతానివి నీవు...
నాలోని ప్రతి తలపుకు ప్రారంభానివి నీవు...

నా ఒంటరి జీవితంలో తొలి నేస్తానివి నీవు...
ఇన్నాళ్ల నా ఎదురుచూపుకు అర్థం నీవు...
నా ఇన్నేళ్ల జీవితానికి పరమార్థం నీవు...
నాకు మాత్రమే కనిపించే సరికొత్త రూపానివి నీవు...

అన్నీ నీవు... అంతటా నీవు... నాలోని ప్రతి అణువూ నీవు...
నాలో చలనాన్ని రగిలించింది నీవు...
నాకు సరికొత్త లోకాన్ని చూపించిందీ నీవు...
కానీ నాకు మాత్రం ఏమీ కావు...

ఇంతగా నిన్ను ప్రేమించాను..నా ప్రానంకంటే ఎక్కువగా..
ఎందుకు దూరం అయ్యావో దూరం అయ్యావు..
మళ్ళీ కలుసుకోలేనంతంగా దూరం అయ్యాము..

అందుకే నీవు లేని ఈ జీవితం వద్దు..
బ్రతకాలనే ఆశ చచ్చిపోయింది..
ఏక్షనంలొ చావు వస్తుందాని ఎదురు చూస్తున్నా..

బండిమీద పోతున్నప్పుడు ఎందుకు ఎక్సిడెంట్ కాదు అని చూస్తున్నా..
వర్షంలో నిల బడ్డప్పుడు నామీద ఎందుకు పిడుగులు పడవాని చూస్తున్నా..
నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎవ్వరో వక్కరు వచ్చి ఎందుకు చంపేయరు..
ఎక్కడన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు పైనె కరెంట్ తీగలు నామీద పడి తే బాగుండు..
ఇలా ప్రతిక్షనం చావుకోసం ఎదురు చూస్తున్నా ప్రియా..నీవు లేని జీవితం నాకొద్దు

Wednesday, April 13, 2011


నేడే నీ పుట్టిన రోజు
సాలుకు ఒకసారి వచ్చే పండుగ రోజు

కనులలో ఆశల హరివిల్లు
పెదవులపై చిరునవ్వులు విరజిల్లు

హ్రుదయంలో ఆనందపు పొదరిల్లు
మనసులో విరబూసిన మల్లెల జల్లు

జీవితం అంతా చిరునవ్వు చెరగకూడదని
మన స్నేహం చెరగకూడదని

అక్షయ తృతీయ అలిగిన రోజు...
అతివల
అవనికి అసూయ కలిగిన రోజు...

అందానికి అర్థం తెలిసిన రోజు...
జాబిల్లికి తోబుట్టువు జన్మించిన రోజు...
నా ప్రేమ పుష్పం ప్రభవించిన రోజు...
ఈ రోజు... నా దేవేరి పుట్టిన రోజు!!
జన్మదిన శుభాకాంక్షలు

Wednesday, April 6, 2011


ఈ రోజు ఎందుకో కలవరం..నీవు ఎక్కడున్నావంటూ మనస్సు అడుగుతోంది
గాయాలు గా మారిన జ్ఞాపకాలు...ఈ రోజెందుకో కలవర పెడుతున్నాయి..
ప్రతి క్షనం గుర్తుకొస్తున్నావు..నీవెక్కడంటూ మనస్సు కూడా నీకోసం తడుముకొంటోంది
మనస్సుకు సమాదానం చెప్పలేక... నాకు నేను సమాదాన పర్చుకోలేక భాదపడుతున్నా
గుండేళ్ళో దాగిన గుప్పెడు నిజాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి ఎక్కడున్నావంటూ అడుగుతున్నాయి..
కన్నీళ్ళకు కరనమౌతున్న నీ జ్ఞాపకాలు..ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నాయి..ఎక్కడున్నావు ప్రియా..
ఎన్నాళ్ళినా ఏన్నేళ్ళీలా..నీకోసం ఎదురు చూపులు అప్పటిదాకా ఈ ప్రాణం ఉండదేమో ప్రియా..?
నీవు గుర్తొచ్చినప్పుడల్లా గట్టీగా పీలుస్తున్న స్వాస.. ఎప్పటిదాకా ఉంటుందో తెలీదు

ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ....?


ఎన్మి పండుగలొచ్చినా ..నీవులేని వసంతం నాకెందుకు..?
కళ్ళలో కాంతులతో చీరకట్టుకొని నీవస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు..
అంతటి అద్బుత సౌందర్యింనీది...అలాంటి నీవు లేకుండా పండుగనా..?
నీ చిరునవ్వుల చిరుజల్లులు నావద్ద లేవు...నామనస్సే నాదగ్గర లేదు..
ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ..
నీవు తిరిగి ఇచ్చినా ఏముంటుంది దానిలో నీవుతప్ప..
గుండెల్లో గుర్తులు నీవులేకుండా నన్ను ప్రశ్నిస్తున్నాయి నీవెవరని..
అలా అడిగిన పశ్నకు నావద్ద సమాదానం మౌనమే..
మౌనం అనేది ఓ భయంకరమైన శిక్ష కదా...?
గలగల మాట్లాడే ఇద్దరి మద్యి మౌనం..ఓ పెద్ద నరకం..
మౌనం..నిజంగా ఇద్దరి మనుషుల మద్యి శాపం..
అది భాదను మరింత పెంచుతుంది..వేదనను మిగులుస్తుంది..
కొన్ని కారనాలు కత్తుల్లా గుండెల్ని తాకడం వల్లే మౌనం అనివర్యిం అవుతుంది..
అందుకే మౌనం కన్నా మరణ శిక్షే నయం ఒక్కసారితో ప్రాణంపోతుంది..
మౌనం ప్రతిక్షనం జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ...మనస్సును భాద పెడుతుంది

నా కనులకు కలలు కనడం తెలుసు
నిన్ను మరువడం మాత్రం తెలియదు..

నీ తోడు నేను కానని తెలుసు
నీనుండి దూరమవడం మాత్రం తెలియదు..

నా పెదవులకు నిన్ను పిలవడం తెలుసు
పరుషంగా మాటలతో గాయపరచడం తెలియదు..

నీ నీడనైన నాకు నీవు తప్ప ..నాకు నేను కూడా తెలీదు
నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం వీడటం తెల్సు


ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే ఎంతబాగుండు..?
నాకు చీకటే బాగుంది..వెలుతురును భరించలేకున్నా..
గుండెళ్ళో భాద...రాత్రి చీకట్లలో కల్సిపోయిన నిజాలు..
ఇక ఇలాంటి రాత్రులు చూడని రోజుకోసం ఎదురుచూస్తున్నా..
నిజాలు నిప్పుకణికలౌతాయి ఎప్పటికైనా అని నమ్ముతా..
అలాంటి నిప్పుల్నే ఎమార్చి..చల్లని ఐసుగడ్డలు చేస్తున్నారు..
నిజానికి, నిజాయితీకి చోటులేదు..నటించేవాల్లదేరాజ్యిం..
నిజాల్ని అబద్దాలు గా మార్చి...గుండెల్లో మంటలు రేపుతున్నారు..
మనిషిగా ఎప్పుడో చచ్చి పోయాను...రగిలిపోయిన మనస్సు ఇప్పుడు బూడిదైంది
ఇప్పుడు ఆనిజం అసలు నిజం కావాలని ఉంది..
ఆనిజంకోసం కొందరు ఎదురు చూస్తున్నారు..
ఈ రాత్రిచీకట్లలా గుండెనిండా చీకటే కమ్ముకుంది..వెలుగులేనంతగా
గుండెలనిండా చీకటి ప్రపంచమంతా చీకటి నాకిక వెలుగులు వద్దు..
వెలుగు వెలుతురు రేఖలు నేను భరించలేను..తట్టుకోలేను..
వద్దనుకున్నా వాస్తవాన్ని తట్టుకోలేక పోతున్నా..బరించలేక పోతున్నా.
ఈ నిషారాత్రి చీకటీలో ఎప్పుడూ కల్సిపోతానా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నా..

నేను అడగ కుండానే నా జీవితంలోకి ప్రవేశించావు
అంధకారమైన నా జీవితంలో ఆశల హరివిల్లులు చూపించావు
మోడు వారిన నా జీవితంలో ప్రేమను చిగురింప చేశావు
ఊహల ఊయలలో విహరింప చేశావు
నా ఆశ నువ్వు, నా శ్వాస నువ్వు, నా సర్వస్వం నువ్వనుకున్నా.....
నా హృదయ మందిరంలో గుడి కట్టి పూజించుకున్నా.....

కానీ..... ఏమిటీ అలజడి..... ఎందుకింత దారుణం.......
ఈ క్షణం నా గుండె ఆగిపోతే బావుండునేమో కదా.....
ఈ భారం నే మోయలేను
..

గుండెళ్ళో అగ్నిగోళాలు పెట్టుకొని నటించడం కష్టం..
పరిస్థితులు అన్నీ ఎదురు తిరుగుతున్నాయి..అందుకే నిర్నయించుకున్నాను..
అందుకే ఆరోజుకోసం ఎదురుచూస్తున్నా...ఎవ్వరకి తెలియకుండా ఉండాలికదా..
అందుకే గుండెళ్ళో అంత భాదపెట్టుకొని నటిస్తున్నా..ఏమీ జరగనట్టు
కాని ఇప్పుడు అర్దం అవుతుంది నటించడం ఎంత కష్టమో..భరించడం కష్టం
వాస్తవాన్ని మరచి ప్రస్తుతాన్ని తరచి చూస్తే ఏమీ అర్దంకాని పరిస్థితి..
నిజం ఇంత ఖటినంగా ఉంటుందో అర్దం కావడం లేదు..అయినా ఎందుకులే..
జరగాల్సిన దానిగురించే ఆలోచిస్తున్నా...జరిగినతరువాత ఆవిషయం మనకు తెలీదుగా..
మంచిగా అలోచించడం ...అందరికి మంచి జరగాలనుకోవడం నేరమా..?

నిన్ను ప్రేమించినందుకు పిచ్చి వాడినయ్యాను.



నిన్ను ప్రేమించినందుకు...
నువ్ నన్ను మరిచిపొమ్మన్నందుకు...
గుండె పగిలేలా ఏడవాలని ఉంది.
కానీ...! నా కనులకు నాపై కరుణ లేదు.
కనీసం ఓ కన్నీటి చుక్కను రాల్చనంటున్నాయి.
దేవుడా...! నాకెందుకీ శిక్ష? అని గట్టిగా అరవాలని ఉంది.
కానీ...! నా పెదవులు నుంచి మాట పెగలడం లేదు.
విధి చేతిలో మోసపోయానని ఆ సమయం కూడా...
టిక్.. టిక్.. అంటూ నన్ను వెక్కిరిస్తోంది.
కనులుండి గుడ్డి వాడినయ్యాను...
నోరుండి మూగ వాడినయ్యాను...
బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది..ఆరోజు ఎప్పుడాని చూస్తున్నా
మనసులో ఎలాంటి ఉద్దేశ్యాలు లేనుకున్నా మంచి చెడు అవుతోంది.
నేనేమైనా ..నన్నేమన్నా అందరూ బాగుండాలన్న కోరిక కూడా తిరగ బడుతోంది.
ఎన్నో భరించాను..భరిస్తున్నాను ఎదురుతిరుగుతున్న ఘటనలు ఇంక తట్టు కోలేను..
ఎన్నని నిదుర లేని రాత్రుల్లు గడపను..చిన్ని గుండె అస్సలు తట్టుకోలేకపోతుంది ..
తెల్లారుతుంటే ఏఘటన ఎదురుతిరుగుతుందోని బయం నీడలా వెంటాడుతోంది
ఎవ్వరికి అపకారం చేయాలనుకోలేదు.ఎవ్వరిని కించపరచాలని అనుకోలేదు..
అందుకే నాకు నేను శిక్షవిదించుకోవాలనుకున్నా..ఈ భాదలు తట్టుకోలేక పోతున్నా

నీ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి
ప్రేమను ప్రేమించడానికి
ఆటుపోటులు వచ్చాయి ప్రేమలో
ఏం చేద్దాం...అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

ఎంత ఆలోచించినా నీ జ్ఞాపకాలను మరులేకున్నాను
అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

ప్రేమలో అన్ని కలలు తియ్యగానేవున్నాయి
కాని.. నీవు లేని లోటుతో
చేదుగా మారింది జీవితం
అయినా నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

క్షణమొక యుగంలా గడిచినా...
రోజులు, నెలలు, సంవత్సరాలు జెట్ స్పీడుతో పరుగెట్టినా...
మునుపటి ఉత్సాహం లేదు..
నిరాశ..నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాను
అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

నిద్ర కోడి నిద్రలా మారింది
ఆలోచనలు ముసురుకుంటున్నాయి
అయినా నీజ్ఞాపకాలు వెంటా...డుతూ...నే.....ఉన్నాయి