---------------
అందమయిన ఒక సాయంత్రం,
ఎప్పటిలాగే నీకోసం నేను వేచిఉండే ఉద్యానవనం,
నీ చూపులలో పడాలన్న ఆరాటం
చందమామ కధలు చదివిన చిన్ననాటి ఆనందం
నన్నెరుగనన్న నీ చూపులో ఆశ్చర్యం
వయసు వేడితో మనసు మండిన ఉక్రోషం
నీ చూపు కోసం వేచివున్న నా మనసు భారం
భాధ్యతెరిగిన పెద్దరికపు గొప్ప అనుభవం
నీ చూపు దక్కని ఆనాటి ఆఖరిక్షణం,
వృద్ధాప్యం లో నేను ఎదురు చూసిన మరణం,
ఇది ఒక్క రోజు నీ కనుచూపు కోసం ముగిసిన నా నిండు జీవితం...
Monday, November 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment