Wednesday, December 22, 2010


నా మనస్సుని గెలిచి ఊహాలను ఓదార్చి ఒంటరి జీవితానికి బానిస చేసావు ...
నీ ప్రేమకు సాక్ష్యం ఈ నా గుండే చప్పుడు నీవు లేకుండా తను బ్రతకలనే అశ కోల్పోయింది ...
అలుపు లేని కన్నీటికి సాక్ష్య్ఝం నీ ప్రేమ ... నీ మౌనంతో నా మనస్సు మూగదయ్యింది ...
ఈ క్షణం కాకపోయిన నా చివరి క్షణంకైనా నువ్వు వస్తావని వేచి ఉంటాను చెలి ...
నీ జ్ఞాపకలే నా ఊహాలకు కావ్యమయ్యాయి .. నీ చిరునవ్వులే నా జీవితానికి బ్రాంతి అయిపోయాయి చెలి .....
బంగారం .... నీ చిరునవ్వులతో నా చితి మంటను కాల్చు ...


ప్రతి కన్నీటికి ఒక అర్థం ఉంటుంది .....
ఒకరు తన కన్నీరు విడుస్తున్నారు అంటే అది ఒక సమస్య అని చెప్పాలేను ....
లోకన్ని ప్రతి మనిషి శాసిస్తాడు . అలాగే ప్రతి మనిషిని కష్టాలు .. కన్నీళ్లు శాసిస్తాయి ...
ప్రతి ఒక్కరు ఆనందాన్ని వెతుకున్నే వాళ్లే ... కాని ఒక్కరైన కన్నీటిని తుడిచేవారు ..... !
కన్నులున్నా వాడే చూడగల్గుతాడు లోకాన్ని ... కనులు లేను వాడు ఊహించగల్గుతాడు ....
చూసింది నిజమో కాదో తెలియని పరిస్థితి చూసిన వాడిది ....
కాని ఊహించిన వాడి ఊహకు రూపం ఉంది ... అది నిజం కాకపోయిన బాధపడడు ... ఎందుకంటే వాడు చూడకుంటా ఊహించాడు ...
ప్రతి కన్నీటిని ఊహించలేము ... దానిని లోతుగా వెళ్లి చూస్తేనే తెలుస్తుంది .. అలా వెళ్లినపుడు నీకు కన్నీళ్లు రావచ్చు ...
పట్టించుకోకు .. కాని ఎదుటివారి కన్నీటికి అర్థం తెలుసుకో .... విత్తిన చోటే చెట్టు పలిస్తుందన్నట్లు ... కన్నీరు ఉన్న చోట ఆనందం ఉంటుందన్నది నా భావన .... నా బాధ , నా కన్నీరు ... నా కష్టాలు , నా వేదన నా ఆనందం కాదు ,,,
నీ కన్నీళ్లకు ఆనందం ... నీ కష్టాలకు సుఖం ... నీ వేదనకు శాంతి ..... నీవు ఆనందంగా ఉండాలి ...


నీ కై తపనలో వెదుకులాటలో
ఎక్కడో నన్ను నేను పారేసుకున్నాను
జీవితాన్ని చే జార్చుకున్నాను
ఇప్పుడు అంత శూన్యం
ఒక్క నీ కోసం చాల పోగుట్టుకున్న
నాకు ఎందుకింత ఆశ....?
నీ కన్నుల వెలుగులతో నా జీవితాన్ని నింపుకోవాలని
నీ కోసం ఎదిరి చూస్తూ ఉంటాను ...
నువ్వు రావని తెలిసిన....
నిన్ను చూస్తూనే ఉంటాను ..
నువ్వు నా ఎదుట లేకున్నా ..
నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను ..
నీకు నేను గుర్తుకురాకున్న ...
నిన్ను నా మనసులో కొలువు0చుతాను..
నా హ్రూధయాన్ని నివు గాయపరిచినా ....
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను....
నీవు నన్ను విడిపోయిన ......
నీ అనుకునే నేను

వేకువజామున ఎమయ్యాయి నీ పలకరింపులు..
వేకువ జామున నీపలకరింపు కోసం ఎదురు చూస్తుంటే పలుకరించి...పడుకో బుజ్జీ అన్న నీపలుకు ఏవి..?
ఎంత గొడవపడిన చివరకు నివు చెప్పే సారీలు ఏవి..?
నేను మాట్లాడకపోతే మౌనవ్రతం చేస్తానన్ని నీ మాటలు ఏవి..?
నలుగురిలో నేను ప్రత్యేకం అన్న నీ మాటలు అబద్దాలేనా
తన అడుగుల సవ్వడిని నా నడకతో లయకలిపేది అంతా బూటకమేనా...
తను విడిచిన శ్వాసతో నాకు ఊపిరిపోసేది...
తన కొంటేతనంతో నన్ను కవ్వించేది... ఏంకావలి అని ప్రశ్నించేది...
కలలోకూడ నాతో కలసిబ్రతకాలి అన్న ప్రేయసి ... ఓ బందానికి తలొంచి ప్రేమను వదిలేసింది...
ఆ క్షణాన కలిగిన భావానికి ఎదిరించే ధైర్యం ఉన్నా... స్వాగతించే ఓపిక తనకిలేదు...
అర్ధం చేసుకునే వయసున్నా ...తెలుసుకునే మనసు తనకిలేదు...
ఎదేమైన తనవల్ల జీవితంలో ..ఓ మంచి స్నేహాన్ని కోల్ఫోయాను
ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది మంచి చేశాననుకొంటూ తప్పులు చేశానేమో అని
ఒక్కటి మాత్రం నిజం నీకు కీడు చేయాలని కలలో కూడా అనుకోలేదు
భయపడిందంతా జరిగింది కాని నేనాసించిన నీ సపోర్టు ఇసుమంతాలేకపోవటం
ఇప్పటికీ నాకర్దంకాని జవాబులేని ప్రశ్న గానే మిగిలిపోయింది?
ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నట్టే..నాతో కల్సి నడుస్తున్నట్టు.
నాపక్కనే ఉండి నవ్వుతున్నట్టు బ్రమలు ఇంకావీడిపోలేదు

ఓకప్పుడు మనం విడిపోతా మేమో అనుకున్నఫ్ఫుడు నీమీద నమ్మకం అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదని
అప్పట్లో నాకు నిద్రలేని రాత్రుల్లకు కారణంకూడా అదే...చివరికి అదే నిజం చేశావు..
కొన్ని పరిస్థితులు ఎందుకు అలా క్రియేట్ అవుతున్నాయో అర్దంకాకుండా ఉన్నాయి
గతించిన ఓ పేజీని వర్తమానం చెరిపేస్తున్న యదలో ఓమూల తనప్రేమ ప్రవాహంలా పొంగుతునే ఉంది


నీవిలా చేస్తావని కలలోకుడా అనుకోలేదు..
పరిచయం ఉన్నన్నాళ్ళు నేను నీతో ఎలాఉన్నాను..
ఏరోజైనా ఏక్షనానైనా ..నిన్ను ఇబ్బంది పెట్టానా
ఒక్కసారిగా ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించలేకపోయావా..?
కొన్ని పరిణామాలకు నేను ప్రత్యెక్షకారణం కాదు..నా అనుకున్నవాళ్ళు చేయించారు..
నివెందుకు కాపని చేశావో నీఉద్ద్యేశ్యం ఏమిటో తెలీయదు..
నీవు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది..ఆరని అగ్ని గోళంలా
నిజాయితీ గా స్నేహం చేసినందుకు మర్చిపోలేని గిష్ట్ ఇచ్చావు..
నీకు తెల్సి చేసావు తేలికచేశావో జీవితంలో మర్చిపోలేని గిప్ట్ ఇచ్చావు..
ఆరని అగ్నిరగిల్చి హాయిగా లైఫ్ ఎంజాయి చేస్తున్నావు
నిన్ను అనేంత ష్టేజి కాదు నాది ...అనుకునేంత స్వతంత్రంలేదు ఇప్పుడు మనమద్యి
మనిషిలోని మనస్సుకు మేధస్సుకు మద్యి వైరం రగిల్చావు..
ఒకప్పుడు కొంచెమే ఉండేది ...నివురుగప్పిన నిప్పులా దానికి అగ్నిని రాజేశావు..
రాజీ పడలేని ఘర్షన..రేపు ఏదైనా జరగొచ్చు అదేగా నీకు కావల్సింది
మనసు గాజుగుండెలో బందించి ఒక్కసారిగా బద్దలు చేసినట్టుంది..