
పవిత్రతకు
దారి తెల్పే పరమ రహస్యం నిశ్శబ్దం
నీ మాటల తూటాలు
నీవు మిగిల్చిన గాయాల తాలూక మచ్చలకు
నిశ్శబ్దం
లేపనంగా మారి మాయం చేస్తుంది
అనే ఆశతో నిశ్శబ్దంగా జరిగేది చూస్తున్నా..
మళ్ళీ తిరిగి వచ్చే వసంతం కోసం కాదు..
ఆ ఆశ ఎప్పుడో చచ్చిపోయింది..
జరిగిన నిజం తెల్సుకునే రోజుకోసం..అ సలు నిజం తెల్సినరోజు ..
కార్చే కన్నీటీ బొట్టులో అబద్దం కొట్టుక పోతుందని ఎదురు చూస్తున్నా నిశ్శబ్దంగా..
కానీ ఆనిజం ఎప్పటికీ తెల్సు కోలేవని..తెల్సుకునే ప్రయత్నం చేయవనేది గట్టినమ్మకం..అదీ గమనిస్తున్నా నిశ్శబ్దంగా