Saturday, January 8, 2011


నీకై ప్రతీక్షణం ఎదురుచూసే నా కనులకేం తెలుసు... నీవు కానరావని!
జీవనదిలా ప్రవహించే నా కన్నీటికేం తెలుసు.... అవి నిన్ను కదిలించలేవని!
అలలా ఎగసిపడి అలసిన నా హ్రుదయానికేం తెలుసు... ఊరడించే చెలి(మి) లేదని, రాదని, ఇకపై రాలేదని!

Wednesday, January 5, 2011


ఎంత హాయిగున్నదో ప్రేమ చేసిన గాయం
ఎంత చల్లగున్నదో మండుతున్న నా హ్రుదయం
ఎంత చక్కగున్నదో చెదిరిన ఈ జీవితం
ఎంత తీయగున్నదో నువ్వు మిగిల్చిన చేదు జ్ఞాపకం

వందలాది ఈ అక్షరాల్లో
అర్ధం కానివి ప్రే.. మ అనే రెండు అక్షరాలేగా..
పొతే పొనీ..అర్ధం కాకపొతే పొనీ

వేలాది బంధాల్లో
దక్కనిది ప్రేమ అనే ఒక్క బంధమేగా..
పొతే పొనీ..దక్కకపొతే పొనీ

లక్షలాది నా జన్మల్లో
వ్యర్ధమయ్యేది ప్రేమ దక్కని ఈ ఒక్క జన్మేగా..
పొతే పొనీ..వ్యర్ధం అయితే పొనీ

కొట్లాది నా గుండె చప్పుల్లలో
అగేది ప్రేమ కొల్పోయిన ఈ ఒక్క చప్పుడేగా
పొతే పొనీ..చప్పుడు ఆగితే పొనీ

చివరికి నా ఈ పంచ ప్రాణాలలో
పోయేది నువ్వైన నా ఈ ఒక్క ప్రాణమేగా
పొతే పొనీ..ప్రాణం పొతే పొనీ

చివరికి నేను
నా ఈ కన్నీటి సంద్రంలో ఏ బింధువులో అయినా
ఆనంద భాష్పాలు దొరుకుతాయేమో అని ఏరుకొంటూ..

ఈ అనంత వాయువులో ఎక్కడన్నా
నీ శ్వాస పరిమళాలు కాస్త కనపడతాయేమో అని అన్వేషిస్తూ..

ఈ జీవిత ఎడారి ఇసుకల్లో ఎక్కడన్నా
నీ పాద ముద్ర కనపడుతుందేమో అని వెతుక్కొంటూ..

ఈ పీడకలల మధ్యన ఎప్పుడైన
నువ్వు కనిపిస్తావేమో అని నిద్ర రాక నిద్ర పొతూ..

నీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొన్న ప్రతీసారి చిన్న సంతోషం లాంటి పెద్ద విచారం కలుగుతోంది ..

నీతో పంచుకున్న జ్ఞాపకాలను స్మరించిన ప్రతీసారి చావలేక బ్రతకాలి అనిపిస్తుంది

గుండెలో దాచుకొన్న నీ రూపం నా గుండెకే గాయాన్ని చేసినా..

కళ్ళల్లో దాచుకొన్న నీ అందం నాకు కంటి చెమ్మనే బదులిచ్చినా...

తెలియని నీ జాడ కోసం తపిస్తున్న నా మనసును చూస్తే

చిన్ని ఆశ లాంటి పెద్ద నిరాశ ఎదురోస్తుంది

ఆనంద బాష్పాల్లాంటి కన్నేటి శోకం మిగులుతుంది

Tuesday, January 4, 2011


మదిలో కట్టుకున్న ప్రేమనే చిట్టి గూడు,
మహావృక్షమై నా ఎదపై పాతుకుని, నను నిలువెల్లా ఆవహిస్తే
నా శరీరంలో ప్రతీ అవయువం, ప్రతీ నరం, ప్రతీ రక్తపుబొట్టూ..
ఆ మహావృక్షమే తన సర్వస్వం అనుకొని,
ఆ ప్రక్రుతిలో ప్రేమ పరిమళాన్ని ఆస్వాదిస్తూంటే!

ఎమయిందో ఏమో! కాలం చేసిన విలయతాండవం,
ఆ మహా వృక్షాన్ని కూకటివేళ్ళతోసహా
పెకలించి విసిరి అవతల పారేసిన
ఆ క్షణం!
గడచి గతమై అందరూ మరచిపోయినా..

ఇప్పటికీ నా శరీరంలో ప్రతీ అణువూ చెమరుస్తూ..
పారిన ఓ చిన్ని సెలయేరు.. ఓ జలపాతమై
మిగిలిన ఎదపై, పగిలిన గాయాలను తట్టిలేపుతుంటే....

గతం మరువలేక,
వర్తమానం గడుపలేక,
భవిష్యత్తును ఊహించలేక
ఈ బాధను భరించలేక..

మౌనంగా ఆక్రోశిస్తూ.. విలపిస్తున్నా...
మరణాన్నైనా దరిచేరమని దయతో, ఆర్ధిస్తూ!

Sunday, January 2, 2011


ఆదమరచి గాడంగా నిదురించేటపుడు...,
హటాతుగా ఏ అర్ధరాత్రో మేలకువను రప్పిస్తావు.
కలవరింతగానో, కలగానో నిదురలోనికి వచ్చి
మెలకువను రప్పిస్తావు.
మెలకువ అయితే నీవు లేవన్నది
జ్ఞప్తికి వచ్చి భాదై కమ్ముకుంటావూ...
ఎక్కడి నుండో మెత్తగా మందలింపులు...
వోదార్పుతో కూడినవి వినపడుతూ ఉంటాయి.
ఎవరా ఎక్కడినుండా అని వెతుకుతూ వుంటే
ఇంకెవరు నీవే...
నా మనసు మూలల నుండి భాధ ఎందుకని
కను బొమలు ఎగరేసి మరి అడుగుతూ ఉంటావు. నీ పద్దతిలో...
ఇంకేముంది పెదాల ఫై నవ్వై చేరుకుంటావు.
పంచధార లాంటి
స్నేహాన్ని, ఆత్మీయతని, ధైర్యాన్ని, సంతోషాన్ని, ఇష్టాన్ని ...
పంచదార లా పంచినందుకు
నీ ప్రతి జ్ఞాపకం పదిలమే ఇప్పటికీ ,
ముగ్దంగా మనోహరం గా మన ముందు కదిలిన వో కుసుమం,
గాలికి దూరమైనా గాని ,
అప్పుడీ విరిసిన తాజా పుష్పం లా నా మనసుని తడుముతూ నే
ఉంటావు ఎప్పటికి...
ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం లో మన అలసట తీర్చడానికి అన్నట్టు ..
ఎవరో ఒక పసి నేస్తం తన చేష్టలతో, అమాయకపు ప్రశ్నలతో
నన్ను తీయ తీయ గా విసిగించి,,
వెళ్ళేటప్పుడు ఏమి తెలియనట్లు చేయి ఊపి ..
పసిపాపలా నీవు వెళ్ళిపోయినా గాని ....
నాకు మాత్రం ఎప్పటికి ఆహ్లాదమై
జ్ఞాపకం లా నిలిచిపోతావు.