Monday, November 15, 2010

ఒకరు..మరొకరు

హృదయం ఒకరైతే..దానిని నడిపే ఊపిరి మరొకరు
దారిని చూపే నయనం ఒకరైతే..దానిని కాచే కనురెప్ప మరొకరు
సేద దీర్చె చల్లని నీడ ఒకరైతే..స్వేదం తుడిచే చల్లని గాలి మరొకరు
బాధ గొన్న హృదయానికి ఆత్మీయ శ్వాంతన ఒకరైతతే...అనురాగ స్పర్శ మరొకరు
విజయంలో అభినందించె నేస్తం ఒకరైతే..ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పే మార్గదర్శి మరొకరు

ఆ ఒకరు...మరొకరు.... ఇంకెవరు???

పెనవేసిన పేగు బంధం...
పలికితేనె తెనెలొలుకు తీయని పదం
ఊటలూరు అమృత భాండం...అమ్మ

ముడివేసిన వివాహ బంధం..
అతను తనుగా భావించే అనురాగ మోహం
ఆత్మీయ బంధం..ఆ సహధర్మచారిణి

వారు కాక ఇంకెవరు... ఆ ఒకరు..మరొకరు.

0 comments:

Post a Comment