Tuesday, May 3, 2011
Monday, April 18, 2011

ప్లీజ్ ఒక్క నిమిషం అయినా నన్ను గెలిపించవా...?
అవును నీవు నన్ను ఎప్పుడూ ఓడిస్తున్నావు..
ఎదిటి వాన్ని గెలిపించాలంటే నీవు నన్ను ఓడించాలి..
అతను గెలవాలనుకుంటుంన్నావు కాబట్టీ నన్ను ఓడిస్తున్నావు..
అప్పట్లో తట్టుకోలేకపోయినా అదేనిజం కాబట్టి తప్పదు..
పర్లేదు ఓటమి .... నాకు ఇచ్చింది నీవు కాబట్టీ ...?
నీకోసం ఎన్ని సార్లయినా ఓటమిని భరిస్తాను భారంగా..?
కాని ఎందుకో ఒక్కనిమిషం అన్నా గెలిపించవా అని అడగాలని ఉంది..
ఒకే ఒక్క నిమిషం చాలు ..ఎందుకంటే అంతకంటే నాకు అర్హత లేదుకదా..
నీకు ఇష్ట లేదు కదూ అందుకే ఓ ఆలోచన చేశా..!
ఎటు ఇది ఏప్రెల్ నెలకాబట్టి..ఒక్క నిమిషం గెలిపించి..?
ఏప్రెల్ ఫూల్ అని అనొచ్చు నీవు..ప్లీజ్ ఒక్కనిమిషం గెలిపించు చాలు..?
నా ఐడియా బాగుందికదా...ప్లీజ్ ఒక్కనిమిషం అన్నా గెలిపించవా ...!
Sunday, April 17, 2011
నా హ్రుదయానికి తగిలిన గాయం మానేలా లేదు..

నా హ్రుదయానికి తగిలిన గాయం మానేలా లేదు..
ఎందుకో తెలీదు నీవంటే నాకంత ఇష్టం.. ఎందుకో నీవు నాకు అలా దూరం అయ్యావు..
దగ్గరగా ఉన్నప్పుడే భయపడే వాడిని ఇంతగా ఇష్టపడుతున్నా దూరం అయితే...?
ఆలోచనే అప్పుడు అంత భయకరమనిపించిది అప్పుడు.. కాని అదేనిజం అయింది.
.నీవు నన్ను అసహ్యించుకునేంతగా.. మరి నాహ్రుదయం ఎంత గాయపడుతుంది చెప్పు..
అదీ నీవు అసహ్యించుకునేంతగా అంటే నేను ఎలా తట్టుకోగలను చెప్పు..
ఇప్పటికీ నీవంటే ప్రాణం అని మాత్రం చెప్పగలను.. నీకోసం ప్రాణం అయినా ఇవ్వగలను
కాని ఇప్పుడు నేనంటే నీకు అసహ్యంకదా...? వద్దు నీవులేని నాజీవితం వద్దు...బ్రతకాలని అస్సలు లేదు..
అదీ నీవు నన్ను అసహ్యించుకుంటున్నావు అని తెల్సి ఎలా బ్రతకను చెప్పు..
నీవు అసహ్యించుకునే జీవితాన్ని నేను ఎలా జీవిస్తాను చెప్పు ప్రియా..

వర్తమానాన్ని తన జ్ఞాపకాల పుటల్లోకి ఆహ్వానించేది గతం.
ఆ తాలూకు అనుభవాలతో భవిష్యత్ని అనుకూలంగా
మార్చుకొవలనుకొనె అమాయకపు వర్తమానం.
వర్తమనపు అంచనాలకై నిరీక్షించింది భవిష్యత్.
భవిష్యత్ నుండి వచిన నేటి వర్తమానంతో పోల్చుకుంటే
నాకు గతం మిగిల్చిన ఆనందం ఎక్కువ.
జరుతుగున్న పరిణామాలు నాకు అర్దంకాకుండా ఉంది .
గతమే శాశ్వతం ఐతే మొన్నటి భవిష్యత్ అంటే నేటి వర్తమనాన్ని..
నమ్మాలో వద్దా ఏంజరుగ బోతోందో తెలియడంలేదు
మొత్తానికి ప్రస్తుతం కాలం మాత్రం నన్ను నేరస్తున్ని చేసింది
నువ్వెవరని వర్తమానం నన్ను వేక్కరించ్చింది వర్తమానం ఎందుకో.
అప్పుడు గుర్తుకొచ్చింది గతం నీలో వెతికినా సహజత్వం..
నీతో పంచుకోవాల్సిన మాటలు మనసులోనే సమాది ఐపోయాయి
కానీ నీ నీడని నాకివ్వకుండా మరెవ్వరికో తోడు అయ్యావు
కానీ నేనంటున్నాను నేనెవరంటే నీ స్వచ్చమైన నేస్తాన్ని
ఈ భావం నీ దరి చేరితే వచ్చే జన్మకు అయిన నీ తోడు అవ్వాలని
ఈ జన్మకు నీకేమౌతానో ప్రియా నీవే సమాదానంచెప్పాలి...
Thursday, April 14, 2011

నిశీధి రాత్రిలో తొలి కిరణం నీవు...
ఆశల సౌధానికి పునాది నీవు...
ఎడారి పయనంలో నీటి చెలమ నీవు...
నేనంటూ ఉన్నానని చెప్పింది నీవు...
నాలోని ప్రతి అంశకు సంకేతానివి నీవు...
నాలోని ప్రతి తలపుకు ప్రారంభానివి నీవు...
నా ఒంటరి జీవితంలో తొలి నేస్తానివి నీవు...
ఇన్నాళ్ల నా ఎదురుచూపుకు అర్థం నీవు...
నా ఇన్నేళ్ల జీవితానికి పరమార్థం నీవు...
నాకు మాత్రమే కనిపించే సరికొత్త రూపానివి నీవు...
అన్నీ నీవు... అంతటా నీవు... నాలోని ప్రతి అణువూ నీవు...
నాలో చలనాన్ని రగిలించింది నీవు...
నాకు సరికొత్త లోకాన్ని చూపించిందీ నీవు...
కానీ నాకు మాత్రం ఏమీ కావు...
ఇంతగా నిన్ను ప్రేమించాను..నా ప్రానంకంటే ఎక్కువగా..
ఎందుకు దూరం అయ్యావో దూరం అయ్యావు..
మళ్ళీ కలుసుకోలేనంతంగా దూరం అయ్యాము..
అందుకే నీవు లేని ఈ జీవితం వద్దు..
బ్రతకాలనే ఆశ చచ్చిపోయింది..
ఏక్షనంలొ చావు వస్తుందాని ఎదురు చూస్తున్నా..
బండిమీద పోతున్నప్పుడు ఎందుకు ఎక్సిడెంట్ కాదు అని చూస్తున్నా..
వర్షంలో నిల బడ్డప్పుడు నామీద ఎందుకు పిడుగులు పడవాని చూస్తున్నా..
నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎవ్వరో వక్కరు వచ్చి ఎందుకు చంపేయరు..
ఎక్కడన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు పైనె కరెంట్ తీగలు నామీద పడి తే బాగుండు..
ఇలా ప్రతిక్షనం చావుకోసం ఎదురు చూస్తున్నా ప్రియా..నీవు లేని జీవితం నాకొద్దు
Wednesday, April 13, 2011

నేడే నీ పుట్టిన రోజు
సాలుకు ఒకసారి వచ్చే పండుగ రోజు
కనులలో ఆశల హరివిల్లు
పెదవులపై చిరునవ్వులు విరజిల్లు
హ్రుదయంలో ఆనందపు పొదరిల్లు
మనసులో విరబూసిన మల్లెల జల్లు
జీవితం అంతా చిరునవ్వు చెరగకూడదని
మన స్నేహం చెరగకూడదని
అక్షయ తృతీయ అలిగిన రోజు...
అతివల అవనికి అసూయ కలిగిన రోజు...
అందానికి అర్థం తెలిసిన రోజు...
జాబిల్లికి తోబుట్టువు జన్మించిన రోజు...
నా ప్రేమ పుష్పం ప్రభవించిన రోజు...
ఈ రోజు... నా దేవేరి పుట్టిన రోజు!!
జన్మదిన శుభాకాంక్షలు
Wednesday, April 6, 2011

ఈ రోజు ఎందుకో కలవరం..నీవు ఎక్కడున్నావంటూ మనస్సు అడుగుతోంది
గాయాలు గా మారిన జ్ఞాపకాలు...ఈ రోజెందుకో కలవర పెడుతున్నాయి..
ప్రతి క్షనం గుర్తుకొస్తున్నావు..నీవెక్కడంటూ మనస్సు కూడా నీకోసం తడుముకొంటోంది
మనస్సుకు సమాదానం చెప్పలేక... నాకు నేను సమాదాన పర్చుకోలేక భాదపడుతున్నా
గుండేళ్ళో దాగిన గుప్పెడు నిజాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి ఎక్కడున్నావంటూ అడుగుతున్నాయి..
కన్నీళ్ళకు కరనమౌతున్న నీ జ్ఞాపకాలు..ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నాయి..ఎక్కడున్నావు ప్రియా..
ఎన్నాళ్ళినా ఏన్నేళ్ళీలా..నీకోసం ఎదురు చూపులు అప్పటిదాకా ఈ ప్రాణం ఉండదేమో ప్రియా..?
నీవు గుర్తొచ్చినప్పుడల్లా గట్టీగా పీలుస్తున్న స్వాస.. ఎప్పటిదాకా ఉంటుందో తెలీదు
ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ....?

ఎన్మి పండుగలొచ్చినా ..నీవులేని వసంతం నాకెందుకు..?
కళ్ళలో కాంతులతో చీరకట్టుకొని నీవస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు..
అంతటి అద్బుత సౌందర్యింనీది...అలాంటి నీవు లేకుండా పండుగనా..?
నీ చిరునవ్వుల చిరుజల్లులు నావద్ద లేవు...నామనస్సే నాదగ్గర లేదు..
ఎప్పుడో నీ దగ్గర పోగొట్టుకున్న నామనస్సు తిరిగి ఇమ్మని అడుగలేను ..
నీవు తిరిగి ఇచ్చినా ఏముంటుంది దానిలో నీవుతప్ప..
గుండెల్లో గుర్తులు నీవులేకుండా నన్ను ప్రశ్నిస్తున్నాయి నీవెవరని..
అలా అడిగిన పశ్నకు నావద్ద సమాదానం మౌనమే..
మౌనం అనేది ఓ భయంకరమైన శిక్ష కదా...?
గలగల మాట్లాడే ఇద్దరి మద్యి మౌనం..ఓ పెద్ద నరకం..
మౌనం..నిజంగా ఇద్దరి మనుషుల మద్యి శాపం..
అది భాదను మరింత పెంచుతుంది..వేదనను మిగులుస్తుంది..
కొన్ని కారనాలు కత్తుల్లా గుండెల్ని తాకడం వల్లే మౌనం అనివర్యిం అవుతుంది..
అందుకే మౌనం కన్నా మరణ శిక్షే నయం ఒక్కసారితో ప్రాణంపోతుంది..
మౌనం ప్రతిక్షనం జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ...మనస్సును భాద పెడుతుంది

ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే ఎంతబాగుండు..?
నాకు చీకటే బాగుంది..వెలుతురును భరించలేకున్నా..
గుండెళ్ళో భాద...రాత్రి చీకట్లలో కల్సిపోయిన నిజాలు..
ఇక ఇలాంటి రాత్రులు చూడని రోజుకోసం ఎదురుచూస్తున్నా..
నిజాలు నిప్పుకణికలౌతాయి ఎప్పటికైనా అని నమ్ముతా..
అలాంటి నిప్పుల్నే ఎమార్చి..చల్లని ఐసుగడ్డలు చేస్తున్నారు..
నిజానికి, నిజాయితీకి చోటులేదు..నటించేవాల్లదేరాజ్యిం..
నిజాల్ని అబద్దాలు గా మార్చి...గుండెల్లో మంటలు రేపుతున్నారు..
మనిషిగా ఎప్పుడో చచ్చి పోయాను...రగిలిపోయిన మనస్సు ఇప్పుడు బూడిదైంది
ఇప్పుడు ఆనిజం అసలు నిజం కావాలని ఉంది..
ఆనిజంకోసం కొందరు ఎదురు చూస్తున్నారు..
ఈ రాత్రిచీకట్లలా గుండెనిండా చీకటే కమ్ముకుంది..వెలుగులేనంతగా
గుండెలనిండా చీకటి ప్రపంచమంతా చీకటి నాకిక వెలుగులు వద్దు..
వెలుగు వెలుతురు రేఖలు నేను భరించలేను..తట్టుకోలేను..
వద్దనుకున్నా వాస్తవాన్ని తట్టుకోలేక పోతున్నా..బరించలేక పోతున్నా.
ఈ నిషారాత్రి చీకటీలో ఎప్పుడూ కల్సిపోతానా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నా..
Subscribe to:
Posts (Atom)


