క్లాసురూములో చెయ్యిపట్టి ఆపినపుడు...
నీవు పడ్డ ఆ తడబాటు..
నా గుండె స్పందనై అలానే ఉంది.
మీ ఇంటి దగ్గర నీతో మాట్లడాలని చూసినపుడు
నీ కళ్ళతో పాటు ఎరుపెక్కిన నీ బుగ్గలు మందారాలై
నా కళ్ళలో అలానే ఉన్నాయి.
బస్సులో నీ వెనుక సీటులో కుచున్నప్పుడు
నను తన్మయత్వంలో ముంచిన
నీ కురులలోని ఆ మల్లెల సువాసన నా మనస్సును వదలనంటుంది
నీ వెనుకాలే నడుస్తూ...
విన్న నీ కాలి అందెల చప్పుడు
నా చెవుల దాటి వెళ్ళనంటూ ఉంది
నేను చూడట్లేదనుకొని నీవు చుసినా ఆ చూపులు
నా ఎదను ఇంకా తాకుతూనే ఉన్నాయి.
కానీ......
నాతో నీవు లేవు...నీ గురుతులు తప్ప
నీ మాట లేదు..నీ పేరునే పలవరించే నా హృదయం తప్ప...
నా ఈ హృదయ స్పందన తప్ప.......
Monday, November 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment