ఉదయపు భానుడి నునువెచ్చని కిరణాలను తాకాలని నన్ను నిద్దురలేపుతావు,
తొలిమంచు బిందువులలో తడుస్తూ ఆనందాన్ని ఆశ్వాదిద్దామంటావు,
సెలయేటి నీళ్ళలో ఈత కొడదామంటావు,
తన రాకకోసం ఎదురుచూడమంటావు,
తన అడుగులకి నా అడుగులు జత కలపమంటావు,
తన చిరునవ్వుల అందాలని వద్దన్నా చూపిస్తావు,
అవసరం కల్పించిమరీ తనతో మాట్లాడిస్తావు,
తనని ప్రేమించమని వేదిస్తుంటావు,
నాకు తెలియకుండానే తనని ఇష్టపడేలా నన్ను మార్చేస్తుంటావు,
నా దానివని ఊరుకుంటే నా మాటే వినడం మానేశావు,
ప్రతిక్షణం తన గురించి ఆలోచిస్తూ తన పక్షం చేరిపొయావు,
నా మనసు వయ్యుండి నన్నే బాధపెడుతున్నావు,
ఓ మనసా ! ! ! అసలు నీకు మనసంటూ ఉందా?
ఉంటే మరి ఎందుకు తనని ప్రేమించమని నాతో వాదన పడుతున్నావు,
ఎందుకు నన్ను వేదన పెడుతున్నావు.
0 comments:
Post a Comment