Friday, April 1, 2011


మగవాళ్ళ ప్రేమ చేరగనిది..

మగవాళ్ళ హృదయాలు రాతి గుండెలు అంటా..
ఆడవాళ్ళ హృదయాలు వెన్నముద్దల అంటా ....
అవును మరి అది నిజ్జమే..
మగవాళ్ళ రాతి (గుండె) పై ఒక రూపం చెక్కితే.
అది శిలై అల్లాగే గుండెల్లో కొలువుంటాది....
చివరకు ఆ గుండె (రాయి) పగిలి పోవాల్సిందే కాని ఇంకో రూపంకి మార్చలేం....

ఆడవాళ్ళ హృదయాలు వెన్నపూసలు ...
ఎన్నో వేల సంవత్సరాల నుండి గుండెల్లో పెటుకొని
పూజించిన రూపాన్ని .. అయినా
చుట్టూ నలుగురు చేరి వారి మాటల వేడి తో వెన్నను కరిగిస్తే .....
ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని గుండెల్లో నింప్పుకోగలరు...
--నాగార్జున

so final conclusion is
మీ ప్రియురాలి హృదయం వేడెక్కకుండా పక్కనే వుండి
cool చేస్తూ వుండాలి ..

Thursday, March 3, 2011


"నువ్వే నా సర్వాస్వం నువ్వు లేని నాకు జీవితమే లేదు", అన్న నీ మాటలకు మురసి...
ఈ ప్రపంచాన్నే నీ పాదాల చెంతకి తీసుకు రావాలని ...
పరిగెత్తాను రా.....
ఒళ్ళు మరచి, నన్ను మరచి, పరిగెత్తాను రా.........
నా ఆకలి .. ఆశలను చంపుకొని..
వెన్నెల వెలుగులను దోసిలిలో నింపుకొని.... అవి నీ పాదాలచెంత ఉంచి
ఆ వెలుగులో నీ చిరునవ్వులు చూడాలని వెనుతిరిగి చూస్తే ......

నువ్వు వేరొకరి చిటికిన వేలు పట్టుకొని తలొంచుకొని నడుస్తున్నవా ............ చెలి..!!!!

ఓ గుండె పగిలినప్పుడు కారే నెత్తుటి చుక్కలే ఈ కవితలు

Monday, January 31, 2011

ఎడబాటు


ఏ జన్మ బంధం ఇది ఎడబాటు బాటైనది ఎద కోత చూసేందుక ఇన్నాళ్ళు కలగన్నది

Tuesday, January 25, 2011


తప్పు చేశాను..నిజంగానే తప్పు చేశాను..
నీకు అర్దం చేసుకునే మనస్సు ఉందని అనుకొని తప్పు చేశాను..
నాలో నిజాయితీని గుర్తిస్తావని తలచి తప్పు చేశాను..
ఇన్ని సార్లు నీగురించి ఆలోచించి..నిజంగా నే తప్పు చేశాను
నీ వెప్పుడూ మనసున్న మనిషిగా ఆలోచిస్తావని తప్పు చేశాను..
నీవేం చేసినా అనుకోని పరిస్థ్తిల్లోనే చేశావని అనుకొని తప్పు చేశాను..
కారణాలు లేకుండా కన్నీళ్ళు ఎందుకు వస్తాయో నని అలోచించి తప్పు చేశాను..
ఇవన్నీ నేను చేసిన తప్పులు శిక్షనేనే గా అనుభవించాలి..తప్పు చేసింది నేను కదా ?
అయితే నేను తీసుకున్న నిర్నయం తప్పుకాదు..మరోసారి తప్పు చేకుండా ఉండాలంటే..?
నీవు ఎదురు చూస్తుంది ఆ నిర్నయం కోసమే కదా మరి ఇన్ని తప్పులకు అదే కరెక్టు

అసలు నీవు నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు
రావడం నీ ఇష్టమే పోవడం నీ ఇష్టమే..
ఎందుకు నాజీవితం నుంచి అకారనంగా వెళ్ళిపోయావు..

అందుకే తాకే ప్రతి అల నీజ్ఞాపకం
నా కాలను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటే
నా ఒంటరి తనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమ........ ??
వీచే చిరుగాలి న మేను ని తడుముతూ ఉంటే
ని స్పర్స ను గుర్తుచేస్తుంటే
ని తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమ...... ??
నేను వేసే ప్రతి అడ్గు
తన తోడును వెతుకుతూ ఉంటే
నా తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమ....... ??
మౌనం గ తల వొంచాను వాటి ప్రశ్నలకి
సమాధానం చెప్పలేక ఇక ఎప్పటికీ చెప్పలేనేమో

Saturday, January 8, 2011


నీకై ప్రతీక్షణం ఎదురుచూసే నా కనులకేం తెలుసు... నీవు కానరావని!
జీవనదిలా ప్రవహించే నా కన్నీటికేం తెలుసు.... అవి నిన్ను కదిలించలేవని!
అలలా ఎగసిపడి అలసిన నా హ్రుదయానికేం తెలుసు... ఊరడించే చెలి(మి) లేదని, రాదని, ఇకపై రాలేదని!

Wednesday, January 5, 2011


ఎంత హాయిగున్నదో ప్రేమ చేసిన గాయం
ఎంత చల్లగున్నదో మండుతున్న నా హ్రుదయం
ఎంత చక్కగున్నదో చెదిరిన ఈ జీవితం
ఎంత తీయగున్నదో నువ్వు మిగిల్చిన చేదు జ్ఞాపకం

వందలాది ఈ అక్షరాల్లో
అర్ధం కానివి ప్రే.. మ అనే రెండు అక్షరాలేగా..
పొతే పొనీ..అర్ధం కాకపొతే పొనీ

వేలాది బంధాల్లో
దక్కనిది ప్రేమ అనే ఒక్క బంధమేగా..
పొతే పొనీ..దక్కకపొతే పొనీ

లక్షలాది నా జన్మల్లో
వ్యర్ధమయ్యేది ప్రేమ దక్కని ఈ ఒక్క జన్మేగా..
పొతే పొనీ..వ్యర్ధం అయితే పొనీ

కొట్లాది నా గుండె చప్పుల్లలో
అగేది ప్రేమ కొల్పోయిన ఈ ఒక్క చప్పుడేగా
పొతే పొనీ..చప్పుడు ఆగితే పొనీ

చివరికి నా ఈ పంచ ప్రాణాలలో
పోయేది నువ్వైన నా ఈ ఒక్క ప్రాణమేగా
పొతే పొనీ..ప్రాణం పొతే పొనీ

చివరికి నేను
నా ఈ కన్నీటి సంద్రంలో ఏ బింధువులో అయినా
ఆనంద భాష్పాలు దొరుకుతాయేమో అని ఏరుకొంటూ..

ఈ అనంత వాయువులో ఎక్కడన్నా
నీ శ్వాస పరిమళాలు కాస్త కనపడతాయేమో అని అన్వేషిస్తూ..

ఈ జీవిత ఎడారి ఇసుకల్లో ఎక్కడన్నా
నీ పాద ముద్ర కనపడుతుందేమో అని వెతుక్కొంటూ..

ఈ పీడకలల మధ్యన ఎప్పుడైన
నువ్వు కనిపిస్తావేమో అని నిద్ర రాక నిద్ర పొతూ..

నీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొన్న ప్రతీసారి చిన్న సంతోషం లాంటి పెద్ద విచారం కలుగుతోంది ..

నీతో పంచుకున్న జ్ఞాపకాలను స్మరించిన ప్రతీసారి చావలేక బ్రతకాలి అనిపిస్తుంది

గుండెలో దాచుకొన్న నీ రూపం నా గుండెకే గాయాన్ని చేసినా..

కళ్ళల్లో దాచుకొన్న నీ అందం నాకు కంటి చెమ్మనే బదులిచ్చినా...

తెలియని నీ జాడ కోసం తపిస్తున్న నా మనసును చూస్తే

చిన్ని ఆశ లాంటి పెద్ద నిరాశ ఎదురోస్తుంది

ఆనంద బాష్పాల్లాంటి కన్నేటి శోకం మిగులుతుంది